చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. మూడవసారి ఆయన ఆ దేశాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు చైనా పార్లమెంట్ జిన్‌పింగ్‌ను శుక్రవారం అధ్యక్షుడిగా మరోసారి ఎన్నుకుంది. తద్వారా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) పార్టీ వ్యవస్థాపకుడు జెడాంగ్ మావో తర్వాత ఈ ఘనత సాధించిన మొదటి చైనా నాయకుడు అయ్యారు. అలాగే జిన్‌పింగ్ చైనాకు జీవితకాలం అధ్యక్షుడిగా ఉండేందుకు కీలక అడుగు పడినట్లయింది. కాగా జీవితాంతం అధికారంలో కొనసాగాలని జిన్‌పింగ్ బలంగా కోరుకుంటున్నారు. అతను ఇప్పటికే సీపీసీ యొక్క గత అక్టోబర్ నెలలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కాగా బీజింగ్‌లో జరుగుతున్న 14వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో ఇవాళ ఆయన్ను ఏకగ్రీవంగా దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
ఇంకా ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తింపు తెచ్చుకున్న సెంట్రల్ మిలిటరీ కమీషన్ (సీఎంసీ) చైర్మన్‌గా కూడా ఆయన ఎన్నికయ్యారు. దీంతో కీలక అధికారాలన్నీ జిన్‌పింగ్ చేతుల్లోకి వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో.. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మిలిటరీ కమీషన్ చైర్మన్‌గా మరియు దేశాధ్యక్షుడిగా జిన్‌పింగ్ చైనాలో అత్యంత బలవంతమైన నాయకుడిగా నిలిచారు. ఇక మరోవైపు చైనా ఉపాధ్యక్షుడిగా జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడు హాన్ జంగ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా 69 ఏళ్ల జీ జిన్‌పింగ్ బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్‌లో రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. అలాగే స్టాండింగ్ కమిటీ చైర్మెన్‌గా ఎన్నికైన జావో లెజితో పాటు ఉపాధ్యక్షుడు హాన్ జంగ్ కూడా ప్రమాణం చేశారు. కాగా నేటి సమావేశంలో జిన్‌పింగ్‌కు అనుకూలంగా 2,952 ఓట్లు ఏకగ్రీవంగా పోలయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE