పశ్చిమబెంగాల్‌: సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. మంత్రి పదవి నుంచి పార్థా ఛటర్జీ తొలగింపు

West Bengal School Jobs Scam CM Mamata Banerjee Expels Partha Chatterjee From Cabinet, CM Mamata Banerjee Expels Partha Chatterjee From Cabinet, West Bengal School Jobs Scam, Partha Chatterjee Removed From Cabinet Ministry Amid West Bengal Job Scam Issue, Partha Chatterjee arrested in SSC scam, Partha Chatterjee sacked as West Bengal cabinet minister, Partha Chatterjee Removed From Cabinet Ministry, West Bengal Job Scam Issue, West Bengal cabinet minister, Bengal SSC Scam, Mamata Banerjee expels Partha Chatterjee from Bengal Cabinet Ministry, West Bengal Industry Minister Partha Chatterjee sacked as West Bengal cabinet minister, school jobs scam, SSC Scam Case, Partha Chatterjee General Secretary of the TMC, General Secretary of the TMC, Partha Chatterjee SSC Scam Case, Partha Chatterjee SSC Scam Case News, Partha Chatterjee SSC Scam Case Latest News, Partha Chatterjee SSC Scam Case Latest Updates, Partha Chatterjee SSC Scam Case Live Updates, Mango News, Mango News Telugu,

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ మరియు పశ్చిమబెంగాల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్‌లో రిక్రూట్‌మెంట్ కు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీని క్యాబినెట్ నుండి తొలగించారు. ఈ మేరకు గురువారం మంత్రి పదవి నుంచి పార్థా ఛటర్జీని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన పలు ఫ్లాట్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడుల్లో వరుసగా కోట్ల రూపాయల అక్రమ నగదు బయటపడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మమత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సీఎం మమతా బెనర్జీ అధ్యక్షతన మధ్యాహ్నం 2.30 గంటలకు పార్టీ అగ్ర నేతలతో కీలక సమావేశం నిర్వహించి దీనిపై వారి అభిప్రాయాన్ని కోరారు. అయితే అందరూ ఛటర్జీని తొలగించాలన్న అభిప్రాయం వ్యక్తం చేయడంతో చివరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈడీ జరుపుతున్న సోదాల్లో భాగంగా.. మొదట అర్పితా ముఖర్జీకి చెందిన నివాసాల్లో ఒకదాని నుంచి రూ.20 కోట్లు, తాజాగా బెల్గోరియా ఫ్లాట్‌లో మరో రూ.29 కోట్ల అక్రమ నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న పార్థా ఛటర్జీ గతంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యుబిఎస్‌ఎస్‌సి) ద్వారా ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో అక్రమ నియామకాలలో ఆయన పాత్ర ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =