షెడ్యూల్ ప్రకార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు, బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్

BRS Party Extensive Meeting: CM KCR Clarifies Assembly Elections will Done as per Schedule,BRS Party Extensive Meeting,CM KCR Clarifies Assembly Elections,Assembly Elections will Done as per Schedule,Mango News,Mango News Telugu,Telangana CM KCR rules out early polls,CM K Chandrashekhar Rao rules out early polls,MLAs To Stay In Constituencies,No early polls, Telangana election as per schedule,KCR Clarified No Early Elections in State,CM KCR Clarified Assembly Elections,Telangana Latest News,Telangana Political News And Updates,CM KCR News and Updates

బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు), పార్లమెంటరీ పార్టీ (ఎంపీలు), బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో కూడిన సంయుక్త సమావేశంలో పార్టీ నేతలకు పలు అంశాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాబోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై సీఎం కేసీఆర్ స్ప‌ష్ట‌త‌నిచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు ఉంటాయన్నారు. అలాగే స‌ర్వేల‌న్నీ బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయ‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నిక‌లు డిసెంబ‌ర్‌ లోనే ఉంటాయ‌ని, పార్టీ నేతలంతా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం కేసీఆర్ సూచించారు. నాయ‌కులంతా నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అలాగే పార్టీల్లో అన్ని స్థాయిల్లో నాయకులు సమన్వయంతో కలిసి పనిచేయాలని, నియోజకవర్గాలుగా సమీక్షలు జరుపుకుని ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం/ప్లీనరీ సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్ లో భారీ సభ నిర్వహించనున్నట్టు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

కాగా బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్స్, కార్పోరేషన్‌ చైర్మన్స్, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్స్ సహా పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంకు ముందు ఇటీవల మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, దివంగత నేత సాయన్న చిత్రపటానికి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =