పెర్ల్ ఇన్ ది బ్లడ్.. తక్కువ బడ్జెట్‌తో అంచనాలు ఏమీ లేకుండానే వచ్చిన ఈ సినిమా.. విమర్శల ప్రశంసలను కూడా అందుకుని మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోయింది. కెనడాకు చెందిన శ్రీలంక తమిళుడు కెన్ కందయ్య (Ken Kandiah) దర్శకత్వంలో వచ్చింది. శ్రీలంకలో తమిళుల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమా కావడంతో కాంట్రవర్శీల మధ్యే రిలీజయింది. కొంతమంది యూత్‌ను , ఓ ఇద్దరు దంపతులను మెయిన్ క్యారెక్టర్స్‌గా అల్లుకుంటూ.. ఈలం తమిళుల ఊచకోత (Massacre of Eelam Tamils)ను ధైర్యంగా బయటపెట్టడంలో డైరక్టర్ ఆడియన్స్‌కు బాగా రీచ్ అయ్యాడు. అందుకే బెస్ట్ మూవీగా అవార్డును సొంతం చేసుకుని.. ఇప్పటికే ఎన్నో చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన పెర్ల్ ఇన్ ది బ్లడ్ (Pearl In The Blood).. అతి త్వరలోనే ఓటీటీలోకి రిలీజవబోతున్నట్లు మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది.
2009 లో శ్రీలంక అంతర్యుద్ధం (Sri Lankan Civil War) జరిగే టైములో.. జరిగిన మానభంగాలు, మర్డర్లు (Rapes And Killings) మెయిన్ కాన్సెప్ట్‌తో వచ్చిన ‘పెర్ల్ ఇన్ ది బ్లడ్’ (Pearl In The Blood) మూవీ అన్ని వర్గాల వారిని కుర్చీలకు అతుక్కునేలా చేసింది. 2019లో తమిళనాడులో షూట్ చేసిన ఈ మూవీకి.. కందయ్యే కథ రాసుకుని, డైరక్షన్ చేయడం సినిమాకు మరో ప్లస్ అయింది. డబ్బుల కోసం కమర్షియల్ సినిమాలకే ఓటేస్తున్న ఇండస్ట్రీ నుంచి దమ్మున్న సినిమాను ప్రజలకు చూపించాడు కందయ్య. అందుకే ప్రాఫిట్‌తో సంబంధం లేకుండా.. సొసైటీని గల్లా పట్టుకుని ప్రశ్నించేలా సినిమా తీసిన అతని ధైర్యానికి ఎంతోమంది నుంచి ప్రశంసలు వచ్చాయి. అలాగే సినిమాల్లోకి ఎంటరయిన బాస్కెట్‌బాల్ ప్లేయర్ సంపత్ రామ్.. బెస్ట్ యాక్టర్‌గా మంచి మార్కులే సంపాదించుకున్నాడు.
బయట భయంకరమైన నేరాలు చేస్తూ దర్జాగా తిరుగుతున్నవారిని.. పెర్ల్ఇన్ ది బ్లడ్ (Pearl In The Blood) సినిమా నిలబెట్టి కడిగేసింది. అత్యాచారాలకు గురైన యువతుల ఆక్రోశాన్ని, కుమార్తెలను దూరం చేసుకున్న తల్లిదండ్రుల దుఃఖాన్ని అందరి ముందుకు తీసుకువస్తూ.. శ్రీలంకలో తమిళుల హత్యలు, దోపిడీలు, చెప్పుకోలేని దారుణాలను సీన్ బై సీన్ చెబుతూ థియేటర్లో కూర్చున్నంత సేపు ఒక ఆడియన్‌గా కాదు.. ప్రతీ ప్రేక్షకుడు ఆ సమయంలో శ్రీలంకలో వారు పడే బాధను తామే అనుభవిస్తున్నామా అన్నంతగా ఫీలయ్యేలా తీసుకెళ్లడంలో డైరక్టర్ ఏ మాత్రం తడబడలేదు. టోటల్‌గా శ్రీలంకలో జరిగిన ఊచకోతను తెరకెక్కిస్తూ ప్రపంచం ముందు లా అండ్ ఆర్డర్ (Law And Order)ను గట్టిగానే ప్రశ్నించిన దమ్మున్న డైరక్టర్‌గా గుర్తింపు పొందాడు కందయ్య.
తాజాగా ‘ఇది శ్రీలంకలో ఊచకోతకు గురైన తమిళుల (Massacre of Eelam Tamils) స్టోరీ మాత్రమే కాదని డైరక్టర్ కెన్ కందయ్య(Ken Kandiah) అన్నాడు. ప్రపంచ దేశాల్లోని ఇతర వర్గాలను అంతమొందించే మైండ్ సెట్‌ను కూడా ఈ సినిమా ప్రశ్నిస్తుందని చెప్పాడు. అయితే శ్రీలంక తమిళుల సమస్యను ఇప్పటికే చాలామంది చూపించారని.. కానీ అక్కడ జరిగిన ‘వైట్ వ్యాన్ స్టోరీ’ని ఎవరూ చూపించలేదని కందయ్య చెప్పుకొచ్చాడు. అయితే దాని ప్రత్యేకత ఏంటో ఈ సినిమాతో తెలుస్తుందని అన్నాడు. సెవన్ హిట్ పిక్చర్స్ బ్యానరుపై తెరకెక్కిన ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తామని చెప్పుకొచ్చాడు. అయితే డబ్బింగ్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఇంకా ఎనౌన్స్ చేయలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE