మనం చనిపోయాక ప్రాణం ఎటు వెళ్తుందో తెలుసా?

Do You Know What Happens After Lost Life Where It Goes From Us,What Happens After Lost Life,Lost Life Where It Goes,Lost Life Goes From Us,Do You Know After Lost Life,Mango News,Mango News Telugu,Do you know where life goes after we die, Where is life in the body, If the part gets damaged or dies,Group of Biological Processes or Reactions,Where Does the Soul Go Immediately,What Physically Happens,Methods of Estimation

ఏదైనా పెద్ద దెబ్బ తగిలినా.. లేక తట్టుకోలేని కష్టం వచ్చినా కొంతమంది ప్రాణం పోయేలా ఉంది అనడం వింటూ ఉంటాం. మరికొన్ని సార్లు గంటో అరగంటో ప్రాణాలతో ఉంటాడు తర్వాత ప్రాణాలు పోయేలా ఉన్నాయని అంటూ అనడం కూడా వింటూనే ఉంటాం. ఇటువంటప్పుడే చాలామందికి అసలు ప్రాణం అంటే ఏంటి? ప్రాణం అంటే వస్తువా? అసలు అది మన శరీరంలో ఎక్కడ ఉంటుందనే ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి.

నిజానికి ప్రాణం అంటే జీవ రసాయన క్రియల సముదాయమే (Group of Biological Processes or Reactions) కానీ ఒక వస్తువు కాదు. కానీ చాలామంది చనిపోయినప్పుడు వారి శరీరాన్ని విడిచి.. మరో శరీరంలోకి ప్రాణం వెళ్లిపోతుందని అంటారు. అంటే శరీరమే నీది కానీ ప్రాణం నీది కాదని (That life is not yours) చెబుతారు. కానీ ప్రాణం అనేది కంటికి కనిపించని గాలి (Invisible air) లాంటి పదార్థం కాదు.. చనిపోగానే గాలిలోనే ఇంకో మనిషిలోనే కలిసిపోవడానికి. అలా అని శరీరంలో ఉండే ఓ వస్తువు కాదు. మన శరీరంలో ఎల్లప్పుడూ జరుగుతూ ఉండే జీవరసాయన క్రియల ప్రాసెస్ (Biochemical process) ఆగిపోతే.. ‘ప్రాణం’ ఆగిపోతుందనే పరిస్థితి ఏర్పడుతుంది. అదే ప్రాణం పోయినట్లు అర్ధం.

శరీరంలో ఉన్న ఎన్నో అవయవాలు ఒకదానితో ఒకటి సమన్వయంతో వివిధ విధులు (Various functions) నిర్వర్తిస్తూ ఉంటాయి. శరీరంలోని అన్ని అవయవాలన్నీ (All organs of the body) సక్రమంగా పనిచేస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. ఆ అవయాలలో సమస్య తీవ్రత మరీ ఎక్కువయితే చనిపోతూ ఉంటారు. అంతే తప్ప శరీరంలోని ఏ పార్టు చెడిపోయో చనిపోతే (If the part gets damaged or dies) ఆ పార్టులో ప్రాణం ఉన్నట్లు కాదు. అలాగే ఒంట్లో బాగా రక్తం పోయినప్పుడు కూడా మనిషి చనిపోతాడు. అంటే ప్రాణం రక్తంలో ఉన్నట్లు కాదు. అలాగే మరికొన్ని సార్లు బ్రెయిన్ డెడ్ అయినపుడు బ్రెయిన్ డెడ్.. అయినా మనిషి అచేతనంగా బతికే ఉంటాడు. అంటే మిగిలిన అవయాలలో ప్రాణం ఉన్నట్లే.

అందుకే ప్రాణం అనేది మనిషి శరీరంలో చర్యలన్నీ సక్రమంగా జరిగినప్పుడే ఉంటుంది. లేదంటే ప్రాణం లేని భౌతిక వస్తువులతో అది సమానమే అవుతుంది. అందుకే శరీరంలోంచి ప్రాణం పోతే ఆ ప్రాణం వేరే మనిషిలోకో ఎక్కడికో పోదు. పైగా జీవ రసాయన క్రియలన్నీ, మనిషి శరీరంలో ఏదో ఒక చోటే జరగడం అంటూ ఉండదు. ఆ చర్యలన్నీ శరీరంలోని అన్ని జీవకణాల్లోనూ నిరంతరం జరుగుతూనే ఉండాలి లేదంటే శరీరం నిర్జీవ వస్తువు కిందే లెక్క. అంటే ఆత్మ రూపంలో ప్రాణం ఉండదు. అంతే తప్ప చాలామంది అన్నట్లు ప్రాణం అంటే ప్రాణమే.. అంతే తప్ప.. జీవం, ఆత్మ, పరమాత్మ కాదన్న విషయాన్ని అంతా తెలుసుకోవాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − six =