జస్ట్ ఒక్క నెల ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి.. ఇక మిరాకిల్స్ మీ ముందే

Liver cirrhosis,If you stop drinking alcohol,Blockage in the arteries,Heart health,Do You Know The Benefits Of Giving Up Alcohol For One Month ,Benefits Of Giving Up Alcohol ,Giving Up Alcohol For One Month ,Stop Alchohol,Mango News, Mango News Telugu,Alcohol Effects,Side Effects Of Alcohol,Effects Of Alcohol ,Effects Of Alcohol On Health,Disadvantages Of Alcohol,Alcohol Use,Effects Of Alcohol On The Body

సరదాగో, స్నేహితుల కోసమో.. మనసు బాగోలేదనో.. మంచి కిక్కు కోసమో కారణం ఏదైనా కానీ మందును తాగుతారు చాలామంది. అయితే అప్పుడప్పుడు ఓకే కానీ కొంతమంది ప్రతి వారం, మరికొంతమంది ప్రతి రోజూ మందు లేకపోతే ప్రపంచమే ఆగిపోయినట్లు ఫీలవుతుంటారు. చుక్క పడిందే పక్క కూడా ఎక్కమన్నట్లు పంతం పట్టి కూర్చుంటారు. మద్యపానం వల్ల ఎన్ని నష్టాలున్నాయో తెలిసినా అలవాటయిన ప్రాణం.. ప్రాణం లాంటి ఆ మందును ప్రాణాలు పోయేవరకూ దూరం చేసుకోరు. దీనివల్ల ఇళ్లు, ఒల్లు గుళ్ల అయినా డోంట్ కేర్ అంటూ మందు మత్తులో తేలుతూ ఉంటారు.

అయితే మరికొంతమంది మానేద్దామని చాలాసార్లు అనుకున్నా..ఆ వ్యసనాన్ని వదల్లేక మళ్లీ ఆల్కహాల్ పాటే పాడతారు. అయితే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు వంటి సమస్యలు వస్తాయి. అందుకే వీలయినంత త్వరగా మందు మానేయాలని డాక్టర్లు చెబుతున్నారు. కనీసం ఒకే ఒక నెల మానేయండి మిరాకిల్స్ జరగకపోతే అడగండి అంటున్నారు. ఒక నెల పాటు మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.

ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల లివర్ సిర్రోసిస్ అనే కాలేయ వ్యాధి వస్తుంది. మందు తాగడం మానేస్తే ఆ మార్పులు రివర్స్ అవుతాయి. అంటే ఆల్కహాల్ మానేసిన రెండు,మూడు వారాల్లోనే కాలేయ పనితీరు మెరుగుపడుతుందట. అలాగే ఒక నెల పాటు ఆల్కహాల్ తాగడం మానేస్తే, గుండె పనితీరులో పెద్ద పెద్ద మార్పులే ఉంటాయి. ఆల్కహాల్ తాగడం వల్ల.. LDL లేదా చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుందట. ఇది ఆక్సీకరణం చెందినప్పుడు, ధమనులలో అడ్డంకిని కలిగిస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఆల్కహాల్ తీసుకోవడం మానేస్తే.. మంచి కొలెస్ట్రాల్ పెరిగి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పిన దాని ప్రకారం ఆల్కహాల్ తాగడానికి, క్యాన్సర్‌కు లింకు ఉందని తేలింది. క్యాన్సర్ మరణాలలో దాదాపు 3.5 శాతం ఆల్కహాల్ వల్లే సంభవించాయని పరిశోధకులు కూడా కనుగొన్నారు. మెయిన్‌గా అన్నవాహిక క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటివి ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల వస్తున్నాయని తేలింది. కాబట్టి తాగడం మానేస్తే క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆల్కహాల్‌లో కేలరీలు ఎక్కువగా ఉండటంతో.. ఈజీగా బరువు పెరుగుతారు. అయితే, మీరు ఒక నెల పాటు ఆల్కహాల్ తాగడం మానేస్తే.. తాగాలన్న కోరిక తగ్గడంతో పాటు.. మీరు అనుకోని విధంగా బరువు తగ్గుతారు. అంతేకాదు ఎక్కువగా ఆల్కహాల్ తాగితే మతిమరుపు సమస్య పెరుగుతుందట. మెయిన్‌గా ఏకాగ్రతను దెబ్బతీసేలా మెదడు తయారవుతుందట. ఎందుకంటే ఆల్కహాల్‌లో ఉండే.. డోపమైన్‌తో మెదడును ఓవర్‌లోడ్ చేస్తుంది. అందుకే ఒక్క నెల మందు బందు చేసి చూసి మీలో జరిగే మార్పులు మీరు జాగ్రత్తగా గమనిస్తే.. జీవితంలో మళ్లీ మందు ముట్టుకోరని అంటున్నారు డాక్టర్లు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =