తెలంగాణలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రసవత్తరంగా మారుతున్నాయి. ఓటర్ల మూడ్ ఎప్పటికప్పుడు ఛేంజ్ అయిపోతుండడంతో.. పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారిపోతున్నాయి. ఊహకు కూడా అందకుండా ఛేంజ్ అయిపోతున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ముందు నుంచి కూడా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని గులాబీ బాస్ ఉవ్విళ్లూరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.
అటు మొన్నటి వరకు రాష్ట్రంలో డీలా పడిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు దూకుడుగా ముందుకెళ్తోంది. కర్ణాటక ఫలితాలను తెలంగాణలో పునరావృతం చేయాలని ప్రయత్నిస్తోంది. సీఎం కుర్చీ దక్కించుకునేందుకు తెరిచి ఉన్న అన్ని దారుల్లో దూసుకెళ్తోంది. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రసవత్తరమైన పోరు ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అటు పొలిటికల్ సర్వేలు కూడ అదే చెబుతున్నాయి. అయితే గట్టి పోటీ ఉన్నప్పటికీ.. అధికారంలోకి వచ్చేది మాత్రం బీఆర్ఎసే అని తాజా సర్వేలు చెబుతున్నాయి.
ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ 2023 ప్రకారం తెలంగాణలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని క్లిస్టర్ క్లియర్‌గా అర్థమవుతోంది. పోయిన ఎన్నికల్లో పడిన ఓట్లతో పోలిస్తే.. ఈసారి పడే ఓట్ల శాతం కాస్త తగ్గినప్పటికీ గెలుపు మాత్రం బీఆర్ఎస్‌దేనని సర్వేలో తేలిపోయింది. ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో.. బీఆర్ఎస్ ఈసారి 49 నుంచి 61 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయచ్చని తేలింది. అటు కాంగ్రెస్ 43 నుంచి 55 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని వెల్లడయింది.
ఓట్ల ప్రకారం గులాబీ పార్టీకి 40. 5 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని పోల్‌లో తేలింది. పోయిన ఏడాది బీఆర్ఎస్‌కు 46.9 శాతం ఓట్లు పడగా.. ఈసారి 6.4 శాతం ఓట్లు తక్కువగా పడే అవకాశం ఉందని స్పష్టమయింది. ఇక కాంగ్రెస్ విషయాన్ని చూసుకున్నట్లయితే.. పోల్ ప్రకారం ఆ పార్టీకి పడే ఓట్ల శాతం 39.4 శాతంగా ఉంది. పోయిన ఏడాది కాంగ్రెస్‌కు 28.3 శాతం ఓట్లు పడగా. ఈసారి 11.3 శాతం ఓట్లు పెరగొచ్చని సర్వే చెబుతోంది. అయితే ఈసారి బీఆర్ఎస్‌కు పడే ఓట్ల శాతం కాస్త తగ్గినప్పటికి కూడా.. మిగతా పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్‌కు పడే ఓట్ల శాతం మాత్రం అధికంగానే ఉంది. దీనిని బట్టి రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ సర్కారే వస్తుందని అర్థమవుతోంది.
ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా 37 శాతం మంది ప్రజలు మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని పోల్‌లో తేలింది. అటు రేవంత్ రెడ్డి సీఎం కావాలని 31.2 శాతం మంది.. బండి సంజయ్ ముఖ్యమంత్రి కావాలని 10.7 శాతం మంది.. అసదుద్దీన్ ఒవైసీ సీఎం కావాలని 2.1 శాతం మంది ప్రజలు కోరుతున్నారని స్పష్టమయింది. అయితే ఓవర్ ఆల్‌గా చూసుకున్నట్లయితే మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదిఏమయినప్పటికీ బీఆర్ఎస్‌కు ఓటర్లు పట్టం కడుతారా?.. కాంగ్రెస్‌కు పట్టం కడుతారా? అనేది డిసెంబర్ 3న తేలిపోనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE