కాంగ్రెస్ నుంచి పిలుపు.. త్వరలో బీజేపీకి విజయశాంతి రాజీనామా?

Call from Congress Vijayashantis resignation to BJP soon,Call from Congress Vijayashantis resignation,Vijayashantis resignation to BJP soon,Vijayashantis resignation,Mango News,Mango News Telugu,telangana politics, bjp, brs, congress, vijayashanti, telangana assembly elections,Telangana Election Latest Updates,Telangana Latest News And Updates, Telangana Political News And Updates,Vijayashanti Latest News,Vijayashanti Latest Updates
telangana politics, bjp, brs, congress, vijayashanti, telangana assembly elections

కీలకమైన అసెంబ్లీ ఎన్నికలవేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల రేస్‌లో దూకుడుగా వెళ్తుంటే.. కాషాయపు పార్టీకి మాత్రం వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి కీలక నేతలు మరో పార్టీలోకి వరుపెట్టి జంప్ అవుతున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ వివేక్ బీజేపీకి బై బై చెప్పేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు బీజేపీ నుంచి మరో కీలక నేత కూడా కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు.

తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు విజయశాంతి. అయితే కొద్దిరోజులుగా పార్టీలో ఆమె అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలో కూడా ఆమెకు తగిన ప్రధాన్యత లభించడం లేదు. పార్టీలో ఆమెను పట్టించుకునే నాథుడు కూడా ఎవరూ లేరు. అంతకంటే ముందు సొంత పార్టీ నేతలపై ఆమె విమర్శలు చేయడంతో.. పార్టీ నేతలంతా ఆమెకు దూరమయ్యారు. అధిష్టానం, సీనియర్ల నుంచి కింది స్థాయి నేతల వరకు అందరూ ఆమెను పక్కన పెట్టేశారు. అసెంబ్లీ ఎన్నికలవేళ పార్టీలో ఆమె పరిస్థితి మరింత దారుణంగా మారింది.

దీంతో కొద్దిరోజులుగా విజయశాంతి పార్టీలో ఉండలేక.. మరో పార్టీ నుంచి పిలుపు రాక సతమతమవుతున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా?.. జంప్ అయిపోదామా? అని ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో ఆమెకు పిలుపు రానే వచ్చినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను కాంగ్రెస్ కలుపుకొని పోతోంది. బీఆర్ఎస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, మైనంపల్లి హన్మంత రావు వంటి దిగ్గజ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అటు కాంగ్రెస్ నుంచి ఎంపీ వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు చేరారు.

అయితే ఇప్పుడు విజయశాంతికి కూడా కాంగ్రెస్ ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. తమ పార్టీలో జాయిన్ చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పార్టీలో తగిన ప్రాధాన్యత.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మొదక్ స్థానాన్ని కాంగ్రెస్ విజయశాంతికి ఆఫర్ చేసిందట. అయితే ఎంతగానో ఎదురు చూస్తున్న పిలుపుతో పాటు.. రెండు ఆఫర్లు కూడా ఇవ్వడంతో.. కాంగ్రెస్‌లో చేరేందుకు విజయశాంతి సిద్ధమయ్యారట.రెండు రోజుల్లో బీజేపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్‌లో చేరనున్నారట. అయితే ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. దీనికి తోడు వరుసగా.. సీనియర్ నేతలు రాజీనామాలు చేస్తుండడంతో.. ఈసారి ఆ పార్టీకి కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 3 =