ఊహాతీతంగా రేవంత్ పాల‌న

Unexpectedly Revanth Palana,Unexpectedly Revanth,Revanth Palana,CM Revanth reddy, Telangana Government, Congress, Telangana Politics,Mango News,Mango News Telugu,Revanth Palana Latest News,Revanth Palana Latest Updates,Revanth Palana Live News,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana News
CM Revanth reddy, Telangana Government, Congress, Telangana Politics

ఎనుముల రేవంత్‌రెడ్డి అనే నేను ..’అని సీఎంగా రేవంత్ రెడ్డిప్రమాణం చేసి నేటికి పదో రోజు. ఈ స్వల్ప వ్యవధిలోనే రేవంత్‌మార్క్‌ ఏమిటో శాంపిల్‌గా చూపించారు.  బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ఎన్నికల్లో హామీలిచ్చే రాజకీయపార్టీలు వాటిని వెనువెంటనే అమలు చేస్తాయని భావించి ఉండరు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక  సెటిల్‌ కావడానికే మూడు నుంచి ఆరునెలల వరకు పడుతుందని అనుకుంటారు. అలాంటిది ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లో రెండు హామీల అమలు నుంచి మొదలు పెడితే ప్రజావసరాల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం, సంక్షేమం కోసం నిత్యం ఏదో ఒక కార్యక్రమాన్ని తెరపైకి తెస్తున్న రేవంత్‌రెడ్డిని పనిమంతుడని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు.

మా సర్కారులో ముఖ్యమంత్రి, మంత్రుల దాకా వచ్చే సమస్యలుండవని, అన్నీ గ్రామాలు, జిల్లాల్లోనే పరిష్కారమవుతాయని బీరాలు పలికిన వారు ఇప్పుడు ప్రజలు ‘ప్రజావాణి’కి క్యూలు కడుతున్న తీరు చూసైనా ఓ సారి పునః ప‌రిశీలించుకోవాలి. సొంతపార్టీ నేతల ఫిర్యాదులే పట్టించుకోకుండా జోకుడు బ్యాచ్‌కు పట్టం కట్టడం వల్లే బీఆర్‌ఎస్‌  ప్రస్తుత దుస్థితికి కారణమనే స్వరాలు పెగులుతున్నాయి. ఎవరైనా అంతే అధికారం ఉన్నప్పుడు  నిజాలు చెప్పే సాహసాలు చేయరు.చేతులు కాలాక ఆకులు పట్టుకునే బదులు.. ఆ ధైర్యమేదో అప్పట్లోనే చేసి ఉంటే ఆపార్టీకి కొంతైనా ఉపకరించేదేమోనని రాజకీయ వ్యాఖ్యాతలు అంటున్నారు.

ఇక ఈ ప‌ది రోజుల్లో రేవంత్‌రెడ్డి పనితీరును అవలోకిస్తే.. ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చడంతో పాటు అసెంబ్లీలోకి అందరికీ ప్రవేశం కల్పించడంతోనే ప్రజలకు  ఇది తమకోసం పనిచేసే ప్రభుత్వమన్న అభిప్రాయం కలిగించగలిగారు.  ప్రజావాణికి వెల్లువెత్తుతున్న ప్రజల్ని చూసి దూరాభారాలకోర్చి రాజధాని దాకా రానవసరం లేకుండా జిల్లా, పట్టణ, గ్రామస్థాయిల్లోనే దరఖాస్తులు స్వీకరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రజావాణితో పాటు నిరసనలు, ధర్నాలు చేసుకునేందుకు ధర్నాచౌక్‌ దగ్గరి ఆంక్షల  ఎత్తివేతకూ ఆదేశాలిచ్చారు. తన  కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గించడంతోపాటు ట్రాఫిక్‌ను ఆపొద్దనీ ఆదేశించారు. ఎన్నికల హామీల కనుగుణంగా ఒక్కో కార్యక్రమం అమలు చర్యలు చేపడుతున్నారు. విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.  ఓవైపు పాలనకు అవసరమైన అధికారులను ఎంపిక చేసుకుంటూనే మరోవైపు ప్రజల కందాల్సిన కార్యక్రమాలు ముందుకెళ్లేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రాచరికపు పోకడలు లేకుండా వ్యవహరిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం  కార్యక్రమం పరుగులు తీస్తోంది. త్వరలోనే సబ్సిడీ గ్యాస్‌ తదితర సంక్షేమ పథకాల అమలుకు చర్యలు ప్రారంభించారు. తాము హామీనిచ్చిన గ్యారంటీలకు తగిన దరఖాస్తుల రూపకల్పనకు ఆదేశించారు.  నిరుద్యోగుల వేదనలు తెలిసి ఉండటంతో మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు పార్టీలోని సీనియర్లను కలుస్తూ వారి ఆశీస్సులు పొందుతున్నారు.తన టీమ్‌లోకి సమర్ధులైన అధికారులను ఎంపిక చేసుకుంటున్నారు. ఇలా మల్టీ టాస్కింగ్‌తో ముందుకెళ్తూ.. పది రోజుల్లోనే తనేమిటో, తన పనితీరేమిటో టీజర్‌ను చూపించారని పలువురు భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ