గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

KTRs harsh comments on Governors speech,KTRs harsh comments,comments on Governors speech,Governors speech,Telangana assembly, Congress vs BRS, KTR, CM Revanth reddy, Ponnam Prabhakar,Mango News,Mango News Telugu,KTRs harsh comments News Today,KTRs harsh comments Latest News,KTRs harsh comments Latest Updates,KTRs harsh comments Live News,Governors speech Latest News,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates
Telangana assembly, Congress vs BRS, KTR, CM Revanth reddy, Ponnam Prabhakar

తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. అప్పుడే అధికార పక్షంపై ప్రతిపక్షాలు దండయాత్ర మొదలు పెట్టాయి. విమర్శలు బాణాలు వదిలాయి. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాచరిక, నిరంకుశ పాలన అంతమైపోయిందని.. ప్రజాపాలన మొదలయిందని వ్యాఖ్యానించారు. ప్రజలు ప్రభుత్వానికి మధ్య అడ్డుగా ఉన్న కంచెలు తొలగిపోయాయని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ భగ్గుమన్నారు. తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.

గవర్నర్ ప్రసంగమంతా దారుణంగా ఉందని.. అన్నీ అసత్యాలే మాట్లాడారని కేటీఆర్ ఆరోపించారు. గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడకగా..సత్యదూరంగా ఉందని భగ్గుమన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. అప్పుడు తెలంగాణ అంతా ఆకలి కేకలు తప్ప ఏమీ లేవన్నారు. సాగునీరు, తాగునీటికి దిక్కులేని పరిస్థితులను తెలంగాణ ప్రజలు అనుభవించారని చెప్పుకొచ్చారు.

అయితే కేటీఆర్ మాట్లాడుతుండగా మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుతగిలారు. కేటీఆర్ ప్రసంగం మొదలు పెట్టడమే దాడి చేసినట్లు స్టార్ట్ చేయడం సరికాదన్నారు. తెలంగాణను అప్పుల ఊభిలోకి నెట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని భగ్గుమన్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. తెలంగాణ రాకముందు ఇక్కడ బీడువారిన భూములు ఉండేవని చెప్పుకొచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనను విధ్వంసం అంటే.. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ఏమనాలని కేటీఆర్ నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఎల్లప్పుడూ ప్రజల తరుపున పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

అటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా రిప్లై ఇచ్చారు. కొంతమంది ఎన్‌ఆర్ఐలకు ప్రజాస్వామ్య స్పూర్థి అర్థం కాదని విమర్శించారు. కేసీఆర్‌కు యూత్ ప్రెసిడెంట్‌గా అవకాశం కల్పించింది కాంగ్రెస్ అని.. కేసీఆర్‌కు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్‌ అని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను కేంద్రంలో కార్మిక శాఖ, షిప్పింగ్ శాఖ మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు. అవకాశం ఇస్తే కేసీఆర్ సింగిల్ విండో ఛైర్మన్‌గా ఓడిపోయారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =