ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్.. ఏపీలో వేడెక్కిన రాజకీయం

Election schedule in February itself Heated politics in AP,Election schedule in February,February itself Heated politics,Heated politics in AP,Mango News,Mango News Telugu,AP Politics, AP Assembly Elections, CM Jagan, chandrababu naidu, YCP vs TDP,Election schedule Latest News,AP Election schedule Latest Updates,AP Election schedule Live News,Heated politics in AP News Today,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
AP Politics, AP Assembly Elections, CM Jagan, chandrababu naidu, YCP vs TDP

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలవుతోంది. రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. పొలిటికల్ హీట్ భగ్గుమంటోంది. ఈసమయంలో ఎన్నికలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయాలను మరింత హీటెక్కించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే రావొచ్చని జగన్ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. తెలంగాణలో 20 రోజుల ముందే ఎన్నికలొచ్చాయన్న జగన్.. ఏపీలో కూడా ముందే రావొచ్చని వ్యాఖ్యానించారు.

ఇక ప్రస్తుత పరిణామాలు.. జగన్ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు అట్టుడికిపోతున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు మాటల యుద్ధానికి దిగడంతో..  రాష్ట్ర  రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అలాగే ఎన్నికలకు తక్కువ సమయం మాత్రమే ఉండడంతో.. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. గెలుపే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. అటు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తక్కువ సమయం ఉండడంతో గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టిపెట్టారు. ఈ మేరకు శుక్రవారం కేబినెట్ సమావేశం నిర్వహించి పెండింగ్‌లో ఉన్న పథకాలు పట్టాలెక్కేలా నిర్ణయాలు తీసుకున్నారు.

అదే సమయంలో తెలుగు దేశం పార్టీ కూడా స్పీడ్ పెంచేసింది. ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ.. ఈసారి ఎలాగైనా సీఎం కుర్చీని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు జనసేన పార్టీతో కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. ఏది ఏమయినప్పటికీ ఈసారి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే యువగళం పేరుతో నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుంటే.. అటు చంద్రబాబు కూడా రాష్ట్రవ్యాప్తం పర్యటనకు సిద్ధమవుతున్నారు.

ఇక ఎన్నికల ముంగిట ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగు దేశం పార్టీలో చేరారు. వైసీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌లు తెలుగు దేశం పార్టీ పుచ్చుకున్నారు. అటు వైసీపీలో ఎవరికి సీటు దక్కుతుందో.. తెలియక సిట్టింగ్‌లంతా అయోమయంలో పడ్డారు. ఈక్రమంలో మరో 75 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేత బోండా ఉమ సంచలన బాంబు పేల్చారు. అలాగే ఈసారి రికార్డులు బద్ధలు కొట్టి.. అధికారంలోకి వస్తామని వ్యాఖ్యానించారు. ఇలా అధికార, ప్రతిపక్ష నేతలు మాటల తూటాలు పేల్చుకోవడం.. ఎన్నికల ముంగిట పలువురు నేతలు పార్టీలు మారడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 20 =