తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు: మంత్రి తలసాని

Ministers Talasani Srinivas Mahmood Ali held Review on Arrangements to be Made for Christmas Celebrations,Telangana Christmas Celebrations,Telangana Government Christmas Celebrations,Minister Talasani Srinivas Yadav,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Christmas, Telangana Christmas Celebrations News And Updates,Telangana Christmas Celebrations News and Live Updates

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి క్రిస్మస్ వేడుకల నిర్వహణ పై నగరంలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ సందర్బంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. క్రిస్మస్ ను పేదలు కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఆలోచనతో పేదలకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్ లు (దుస్తులు) పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం లో విందును ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ విందుకు సీఎం కేసీఆర్ హాజరవుతారని తెలిపారు.

అదేవిధంగా ఒక్కో నియోజకవర్గ పరిధిలో 8 ప్రాంతాలలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని మంత్రి అన్నారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల సహకారంతో చర్చి కమిటీ ప్రతినిధులతో సమావేశాలను నిర్వహించి డిన్నర్, గిప్ట్ ప్యాక్ ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ప్రాంతానికి 500 చొప్పున గిప్ట్ ప్యాక్ లు, డిన్నర్ నిర్వహణ కోసం ఒక లక్ష రూపాయలు చొప్పున అందించనున్నట్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని పండుగలకు ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని వివరించారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందని చెప్పారు. ఎమ్మెల్యేల సమన్వయంతో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు.

అదేవిధంగా ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అందజేయాలని, వాటిని ఆయా నియోజకవర్గాల పరిధిలోని చర్చి కమిటీల ప్రతినిధులకు అందజేస్తారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని, పండుగలు గొప్పగా జరుపుకోవాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన, ప్రభుత్వ ఉద్దేశం అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండలి ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీలు స్టీఫెన్ సన్, సురభి వాణి దేవి, హసన్ జాఫ్రీ, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాద్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, కౌసర్ మొహినోద్దిన్, టీఎస్ఈడబ్ల్యూఐసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎండీ కాంతి వెస్లీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =