నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అతనే..

Anil Kumar Yadav Contesting As Mp From Narasa Raopet

ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా దూకుడుగా ముందుకెళ్తున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. ఏప్రిల్‌లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుండడంతో స్పీడ్ పెంచేశారు. తమ అభ్యర్థులను బరిలోకి దించే పనిలో నిమగ్నమైపోయారు. ఇప్పటికే యాభైకి పైగా అసెంబ్లీ స్థానాలు.. పది లోక్‌సభ స్థానాలకు ఇంఛార్జ్‌లను మార్చిన జగన్.. మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ సమయంలో పెద్ద ఎత్తున నేతలు రాజీనామాలు చేస్తుండడంతో జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది.

ఇటీవల నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి, తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ హైకమాండ్ సూచించడంతో.. శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. అయితే ఆ స్థానం నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపాలని భావిస్తున్న జగన్.. ఆ వర్గంలో బలమైన నేతల పేర్లను పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం చిలకలూరి పేట అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విడదల రజినీని ఇటీవల గుంటూరు వెస్ట్‌కు ఛేంజ్ చేశారు. అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేయడంతో.. నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని జగన్.. విడదల రజినికి సూచించినట్లు మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఇప్పటికే రజినితో మాట్లాడారని.. ఆమెనే నరసరావుపేట నుంచి పోటీ చేస్తుందని గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేరును నరసరావుపేట ఎంపీ సీటు కోసం జగన్ పరిశీలిస్తున్నారట.

అనిల్ కుమార్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. దీంతో రజినిని కాకుండా అనిల్ కుమార్ యాదవ్‌ను నరసరావుపేట నుంచి పోటీ చేయించాలని జగన్ అనుకుంటున్నారట. ఈ మేరకు గురువారం అనిల్ కుమార్ యాదవ్ సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లి జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని జగన్.. అనిల్ కుమార్ యాదవ్‌కు సూచించారట. ఈ విషయంపై ఆలోచించుకునేందుకు కొంత సమయం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి అనిల్‌కు నెల్లూరును వదిలిపెట్టడం ఇష్టమేనా..? గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తారా? లేదా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY