రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన వైస్సార్సీపీ సభ్యులు

Andhra Pradesh, New Rajya Sabha MPs, rajya sabha, Rajya Sabha Members, Rajya Sabha Members List, YCP Rajya Sabha Members, YSRCP Leaders Take Oath In Rajya Sabha, YSRCP Rajya Sabha Members, ysrcp rajya sabha members list, YSRCP Rajya Sabha Members Take Oath

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైస్సార్సీపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పరిమళ్‌ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభకు ఎన్నికైన వైస్సార్సీపీ సభ్యులు జూలై 22, బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేయగా, ఆ తర్వాత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణ తెలుగులో ప్రమాణం చేశారు. మరో సభ్యుడు పరిమళ్‌ నత్వానీ వ్యక్తిగత కారణాలతో ఈ రోజు ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. అలాగే ఇటీవల 17 రాష్ట్రాలకు సంబంధించి రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన 55 మందిలో ఈ రోజు చాలామంది ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 13 =