రెండు స్థానాలు ప్రకటించిన జనసేన

Jana Sena Announced Two Seats,Janasena,AP Elections,Pawan kalyan,Janasena Seats,Mango News,Mango News Telugu,AP Elections 2024,Janasena News,Janasena Latest News,AP Elections Janasena Seats,Pawan kalyan Latest News,Pawan declares two seats,Pawan Kalyan On Alliance Two Seats,Pawan Kalyan Announced Two MLA Seats,Jana Sena MLA Seats,Razole,Rajanagaram,Jana Sena Razole And Rajanagaram Seats

ఏపీలో ఎన్నికల వేడి భగ్గుమంటోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈసారి వైసీసీ సర్కార్‌ను ఢీ కొట్టేందుకు తెలుగు దేశం, జనసేన పార్టీలు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. ప్రస్తుతం సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఈక్రమంలోనే చంద్రబాబు నాయుడు ఇటీవల రెండు స్థానాలను ప్రకటించి సంచలనానికి తెరలేపారు. అరకు, మండపేట స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని.. తమ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు ప్రజలకు సూచించారు.

అయితే చంద్రబాబు తీరుపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు స్థానాల్ని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు మిత్ర ధర్మం పాటించకుండా.. రెండు స్థానాలను ఎలా ప్రకటిస్తారని చంద్రబాబును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా రెండు స్థానాల్ని ప్రకటించడం సరికాదన్నారు. ఈ మేరకు చంద్రబాబు రెండు స్థానాలు ప్రకటించినందుకు.. పవన్ కళ్యాణ్ కూడా తమ పార్టీ పోటీ చేయబోయే రెండు స్థానాలను ప్రకటించారు.

అవును.. జనసేనాని పవన్ కళ్యాణ్ రెండు స్థానాలను ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజానగరం, రాజోలు నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేస్తుందని వెల్లడించారు. తెలుగు దేశం పార్టీ మిత్ర ధర్మాన్ని విస్మరించినందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. పొత్తులో ఉన్నందున తమతో సంప్రదింపులు జరపకుండానే చంద్రబాబు రెండు స్థానాలు ప్రకటించారని అన్నారు. లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా తాము మౌనంగా ఉన్నామన్న పవన్ కళ్యాణ్.. వాళ్లు రెండు స్థానాలు ప్రకటించారు కాబట్టి తాము కూడా రేండు స్థానాలు ప్రకటిస్తున్నామని చెప్పుకొచ్చారు.

చంద్రబాబుకు ఉన్నట్టే తనకూ ఒత్తిడి ఉందన్న పవన్.. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ రెండు స్థానాలను ప్రకటించామని వెల్లడించారు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానని చెప్పారు. తాము బలం ఇచ్చేవాళ్లం అవుతున్నాం కానీ.. బలం తీసుకునే వాళ్లం కాలేకపోతున్నామని.. ఇందుకు పార్టీ నేతలు తనను క్షమించాలని అన్నారు. పవన్ జనంలో తిరగడని, వాస్తవాలు తెలియవని కొందరు విమర్శిస్తున్నారన్న పవన్.. అవన్నీ తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చామా? అని ప్రశ్నించారు. ఎన్నికలవేళ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =