చిరంజీవితో పాటు ఐదుగురికి పద్మవిభూషణ్‌ అవార్డులు

Padma Vibhushan Award For The Megastar,Chiranjeevi

ప్రతి ఏడాదిలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈసారి కూడా  పురస్కారాలను ప్రకటించింది. తమ సేవల ద్వారా సమాజంలో తమ సొంత గుర్తింపును సృష్టించుకున్న వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు.అలా ఈ ఏడాది ఐదుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, హీరో చిరంజీవికి పద్మవిభూషణ్ ..నటుడు మిథున్ చక్రవర్తికి పద్మభూషణ్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఈ ఏడాది  పద్మ పురస్కారాల కోసం మొత్తం 132 మంది ప్రముఖుల జాబితాను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.ఐదుగురు ప్రముఖులకు ఈ ఏడాది పద్మవిభూషణ్‌తో సత్కరిస్తున్నట్లు ప్రకటించింది.  మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు, ప్రముఖ హిందీ సినీ నటి వైజయంతిమాల, ప్రముఖ నర్తకి పద్మా సుబ్రమణ్యం, మెగాస్టార్ చిరంజీవి, బిందేశ్వర్ పాఠక్ (మరణానంతరం) ఈ జాబితాలో ఉన్నారు.

దీంతో మెగాస్టార్‌ చిరంజీవికి మరో అత్యున్నత పురస్కారం వరించినట్లు అయింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాది ప్రకటించే పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పద్మ విభూషణ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. సినీ, రాజకీయ రంగానికి చిరంజీవి  చేసిన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఇప్పటికే చిరును  పద్మ భూషణ్‌ అవార్డుతో గౌరవించింది. కరోనా, లాక్‌డౌన్ సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి చేసిన సేవలను గుర్తించిన మోడీ ప్రభుత్వం చిరంజీవిని ఈ సారి పద్మవిభూషణ్‌తో సత్కరించనుంది.

కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో  వేలమంది సినీ కార్మికులకు చిరంజీవి ఎంతగానో సేవ చేశారు .  ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు సీసీసీ పేరుతో నిత్యావసరాలను అందజేశారు. ఉచిత ఆరోగ్య పరీక్షలు కూడా చేయించడంతో పాటు.. అంబులెన్స్‌, ఆక్సిజన్‌ సదుపాయాలను కూడా కల్పించారు. 2006లో కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో మెగాస్టార్ పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చిరంజీవిని పద్మవిభూషణ్‌తో సత్కరించనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =