ఏపీలో టీడీపీ వైపు.. తెలంగాణ‌లో కాంగ్రెస్ వైపు నేత‌లు

Congress, Telugu desam, AP, Telangana, Elections, YSR, Andhra Pradesh, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, chandrababu naidu, Mango News Telugu, Mango News
Congress, Telugu desam, AP, Telangana, Elections

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు.. సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో తెలంగాణ‌లోనూ రాజ‌క‌యీ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో కీల‌క నేత‌లు తారుమార‌వుతున్నారు. ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నారు. అవ‌కాశం వ‌స్తే దూకేందుకు చాలా మంది సిద్ధం అవుతున్నారు. స‌ర్వేలపై ఓ దృష్టి పెడుతున్నారు. ఇండియా టుడే ఛానల్ మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో  సీ ఓటర్ సంస్థతో కలిసి  తాజాగా విడుదల చేసిన ఫ‌లితాల‌ను బ‌ట్టి పార్టీల బ‌లాబ‌లాల‌ను అంచ‌నా వేస్తున్నారు. ఇండియా టుడే పేరిట వెల్ల‌డైన స‌ర్వేలో 25 పార్లమెంట్ స్థానాలలో.. టీడీపీ-జనసేన కూటమి 17 స్థానాలతో ముందంజలో ఉండగా.. వైసీపీ మాత్రం ఎనిమిది స్థానాలుగా ఉంది. టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు సర్వేలో తెలుస్తోంది. వైసీపీ కూడా  41% ఓట్లు దక్కించుకుంటుందని ఇండియా టుడే సర్వే తేల్చింది. ఇక తెలంగాణ‌లో లోక్ స‌భ ఎన్నిక‌లు కూడా కాంగ్రెస్ వైపు ఉన్న‌ట్లు చెబుతున్నాయి.

ఈ క్ర‌మంలో ప‌లువురు నేత‌లు గోడ దూకేందుకు సిద్ధం అవుతున్నారు. కొంద‌రు ఇప్ప‌టికే పార్టీలు మారిపోయారు. తెలంగాణ రాష్ట్రానికి వ‌స్తే.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మంత్రి పదవి పొందిన పట్నం మహేందర్‌రెడ్డి, జిల్లాపరిషత్‌ చైర్మన్‌గా ఉన్న ఆయన భార్య సునీతరెడ్డి  కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైనట్టే. చేరేందుకు ముహూర్తం మాత్రమే మిగిలింది. జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, సిట్టింగ్‌ కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. బీఆర్‌ఎస్‌ను వీడాలని బాబాకు లేకపోయినప్పటికీ, ఆపార్టీ నేతల తీరే ఆయనను తీవ్రంగా కలచివేయడంతో పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే మాగంటిగోపీనాథ్‌కు ఎదురొడ్డి సుదీర్ఘకాలంగా ఆయన పోరాటం చేస్తున్నారు.

విద్యార్థి దశనుంచి ఉద్యమంలో ఉన్న తనకు పార్టీ  ప్రభుత్వంలోకి వచ్చాక తగిన గుర్తింపునిచ్చి డిప్యూటీ మేయర్‌ పదవి నిచ్చినప్పటికీ, రెండో దఫా అధికారంలోకి వచ్చాక ఆయన  వినతుల్ని పట్టించుకోవడం మానేసింది.కడకు ప్రాణభయం ఉందని తెలిపినా పట్టించుకోని నేతల దగ్గర ఉండలేక వెళ్తున్నట్లు ఆయనే తన లేఖలో వెల్లడించారు. అంతేకాదు పార్టీ గమ్యమే దారితప్పిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌లోని రెండు రకాల పరిస్థితులకు  పట్నం దంపతులు, బాబా ప్రస్తుత నిదర్శనాలు. ఎన్ని అవమానాలు, అగచాట్లు ఎదురైనా పార్టీఅధికారంలో ఉంటే ఉండేవారేమో కానీ పార్టీయే అధికారంలో లే నప్పుడు తమకిక దాంతో పనేముందని భావించినట్లున్నారు పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు, బాబాఫసియుద్దీన్‌ సైతం. పట్నం సునీతరెడ్డి చైర్మన్‌ పదవీకాలం త్వరలో ముగియనుండటంతో ఎంపీ టిక్కెట్‌ హామీ లభించినట్లు తెలుస్తోంది.

గత ముఖ్యంత్రి కేసీఆర్‌ ప్రయోగించిన విద్యనే ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఆచరిస్తున్నట్లు కనిపిస్తోంది.దాన్నెవరూ తప్పుపట్టడం లేరు. ఇప్పటికే పలువురు ఆయనతో టచ్‌లో ఉన్నారు. కాకపోతే లోక్‌సభ ఎన్నికలకు ముందుగానా..తర్వాతనా అన్నది మాత్రమే తేలాల్సి ఉంది. ఇప్పటికే సునీతా లక్ష్మారెడ్డి నుంచి మొదలుపెడితే మేయర్‌ విజయలక్ష్మి దాకా ఎందరెందరో బీఆర్‌ఎస్‌ నేతలు .. కార్పొరేటర్‌ స్థాయి నుంచి మంత్రుల స్థాయి వరకు వారు రేవంత్‌రెడ్డిని కలవడం ఈ సందర్భంగా గమనార్హం. వారు చెప్పిన కారణాలు ఏవైనా   అవసరమైతే అధికార పార్టీకి వెళ్లేందుకు, పదవులుపొందేందుకు తమ ‘దారి’ ఉందని చెబుతున్నట్లుగానే భావించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోకి వచ్చే మూడు జిల్లాలనుంచి దాదాపు అరడజనుమందికి పైగా  బీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. వారిలో చాలామంది పూర్వాశ్రమంలో కాంగ్రెస్‌వారే కావడం గమనార్హం. ఏపీలో కూడా చంద్ర‌బాబునాయుడు ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ ను వ్య‌తిరేకించే నేత‌లంద‌రూ త‌మ‌తో క‌లిసి రావాల‌ని. ఈ క్ర‌మంలో ప‌లువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మ‌రికొంద‌రు సిద్ధంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో మున్ముందు ఎవ‌రు ఏ పార్టీలో ఉంటార‌నేది ఆస‌క్తిగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE