ఎంపీ స్థానాల్లో పోటీపై క్లారిటీ

Telangana,Leftists Clarity,competition in MP seat, CPI Leader Narayana, Congress, Parliament Elections, CPI, CPM,Revanth Reddy News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party,Mango News Telugu,Mango News
Telangana,Leftists Clarity,competition in MP seat, CPI Leader Narayana, Congress, Parliament Elections, CPI, CPM

తెలంగాణలో పోటీచేయబోయే పార్లమెంటు స్థానాలపై… వామపక్షాలు ఓ క్లారిటీకి వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికలలో బరిలో దిగే అభ్యర్థులను ప్రకటించే విషయంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో లెఫ్ట్‌ పార్టీలు అలర్ట్ అయ్యాయి.

వెంటనే తమకు అనుకూలమైన స్థానాల జాబితాను వామపక్షాలు కూడా సిద్ధం చేశాయి. తమ పొలిటికల్ ప్రయాణం కాంగ్రెస్‌తోనే అంటున్న సీపీఐ.. తమకు అనుకూలమైన 5 ఎంపీ స్థానాలతో ప్రతిపాదనలను సిద్ధం చేసింది. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, పెద్దపల్లి, భువనగిరి స్థానాల్లో తమ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని సీపీఐ నేత నారాయణ చెబుతున్నారు. అందుకే  వీటిలో ఏ ఒక్క స్థానంలో అయినా తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరుతున్నారు. వామపక్షాలతో కలిసి నడిస్తేనే..పార్లమెంటు ఎన్నికలలో కూడా  విజయం సాధించే అవకాశం ఉంటుంని కాంగ్రెస్ పార్టీకి  ఆయన సూచించారు.

మరోవైపు సీపీఐతో పాటు సీపీఎం కూడా పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీపై ఒక క్లారిటీకి  వచ్చింది. కాంగ్రెస్‌ ఒప్పుకుంటే తాము కూడా పొత్తుకు రెడీ అంటోంది. తాము కూడా రెండు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేస్తామని చెబుతోంది. అయితే కాంగ్రెస్‌తో పొత్తు ఉన్నా లేకపోయినా కూడా సీపీఎం పార్టీ రెండు స్థానాల్లో పోటీ చేయడం ఖాయమని తాజాగా జరిగిన రాష్ట్రస్థాయి మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. సీపీఐతో కలిసి పనిచేసిన హస్తం పార్టీ… బీఆర్‌ఎస్‌ను ఎవరూ ఊహించని రీతిలో ఓడించి అధికారాన్ని దక్కించుకుంది.  తాజాగా తెలంగాణలో 14 ఎంపీ స్థానాలను లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ… వామపక్షాలతో జత కట్టడానికి ఒప్పుకుంటుందా? ఒక వేళ ఒప్పుకుంటే సీట్ల కేటాయింపులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE