ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణం – ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Says Opening of Party Office in Delhi is The Proud Moment For Every BRS Soldier,MLC Kavitha Says Opening of Party Office in Delhi,The Proud Moment For Every BRS Soldier,BRS Party Office in Delhi,Mango News,Mango News Telugu,MLC Kavitha Says Opening of Party Office,MLC Kavitha,MLC Kavitha Latest News And Updates,BRS Soldier,Kalvakuntla Kavitha Latest News,BRS MLC Kalvakuntla Kavitha,BRS Party Office In Delhi,Telangana CM to inaugurate BRS party office,K Chandrasekhar Rao inaugurates BRS Central Office

దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణమని పేర్కొన్నారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ మేరకు ఆమె శుక్రవారం బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభమైన సందర్భంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ మరియు శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ పట్టుదల, నిబద్ధత వల్లే బీఆర్‌ఎస్‌ పార్టీ అనేక అవరోధాలను అధిగమించి నేడు ఉన్నత స్థానానికి చేరుకుందని కవిత అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్‌లో ఇలా తెలిపారు.. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే ఏకైక లక్ష్యంతో మొదలైన పార్టీ క్లిష్ట రాజకీయ పరిస్థితుల్లోనూ, తెలంగాణా ఆలోచనను నమ్మిన ప్రతి పౌరుడి అఖండ మద్దతుతో విజయం సాధించింది’ అని తెలిపారు.

ఇంకా కవిత ఇలా చెప్పారు.. ‘ఇక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్న 39 రాజకీయ పార్టీలను ప్రోత్సహించిన నిబద్ధతతో ఒక లక్ష్యం ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ ఏర్పాటు మరియు అభివృద్ధి కోసం కేసీఆర్‌కు ఉన్న రాజనీతిజ్ఞత, పట్టుదలే నేడు లోక్‌సభలో 9 ఎంపీలు, రాజ్యసభలో 7 ఎంపీలు.. ఇంకా తెలంగాణలో 105 మంది ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్‌తో పార్టీ జాతీయ శక్తి కేంద్రంగా ఎదిగింది. మా పార్టీ ఢిల్లీ కార్యాలయాన్ని ప్రారంభించడం ప్రతి గులాబీ సైనికుడికి గర్వకారణం. ఇది మన దార్శనిక నాయకుడు కేసీఆర్ గారు మరియు ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరూ, ఆయన దార్శనికత మరియు బీఆర్‌ఎస్‌ పార్టీ నిబద్ధతతో చేసిన అద్భుతమైన ప్రయాణం’ అని ఉద్వేగంగా పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =