పెదకూరపాడు టీడీపీ టికెట్‌పై అయోమయం

TDP flag, YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan,TDP ticket,Pedakurapadu TDP ticket,Namburu Shankar Rao, Kommalapati Sridhar,Bhashyam Praveen, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
TDP flag, YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan,TDP ticket,Pedakurapadu TDP ticket,Namburu Shankar Rao, Kommalapati Sridhar,Bhashyam Praveen

రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతుండటంతో పెదకూరపాడులో తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌కు ఈ సారి టికెట్ ఉండదన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది.దీంతో ఆయన అనుచరులు, మద్దతుదారులు సమావేశాలు పెట్టి మరీ కొమ్మాలపాటికే టికెట్ ఇవ్వాలని పట్టు బడుతున్నారు. కొత్త నాయకులతో  పార్టీకి నష్టమే తప్ప కొత్తగా కలిసొచ్చేదేమీ ఉండదని అంటున్నారు. అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో, చివరికి పెదకూరపాడులో నిలబడే అభ్యర్థెవరో తెలియని అయోమయంలో టీడీపీ కేడర్ ఉంది.

2009లో టీడీపీలో చేరిన కొమ్మాలపాటి శ్రీధర్‌ పెదకూరపాడు నుంచి పోటీ చేశారు. ఆర్థికంగా అక్కడ బలంగా ఉండటంతో పాటు, అప్పుడు జరిగిన ఎన్నికల్లో కన్నా లక్ష్మీ నారాయణ గుంటూరుకు వెస్ట్ నియోజకవర్గానికి ఛేంజ్ అవడంతో శ్రీధర్  ఈజీగానే విజయాన్ని సాధించారు. ఆ తర్వాత 2014లోనూ అదే జోరును కంటెన్యూ చేస్తూ.. రెండోసారి విజయం సాధించారు. అయితే ముచ్చటగా మూడోసారి 2019లో బరిలోకి దిగిన కొమ్మాలపాటి.. వైసీపీ అభ్యర్థి నంబూరి శంకర్ రావు చేతిలో ఓటమిపాలయ్యారు.

ఇప్పుడు కూడా కొమ్మాలపాటి పెదకూరపాడు టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్నా కూడా .. వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నంబూరి శంకర్‌ని ఢీకొట్టలేరన్న అభిప్రాయంతో పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారట. అయితే కొన్నాళ్లుగా అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం ఉంటున్నా కూడా.. కొమ్మాలపాటి టికెట్‌ తనకేనని చెబుతూ వస్తున్నారు.కానీ తాజాగా భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు తెలుగు దేశం పార్టీ అభ్యర్థి అంటూ.. సోషల్ మీడియాలో ప్రచారంతో పాటు పార్టీశ్రేణుల్లోనూ పెద్ద చర్చ జరుగుతోంది. దీంతో అప్రమత్తమైన కొమ్మాలపాటి శ్రీధర్.. వెంటనే తన అనుచరులతో సమావేశమై చర్చించారు. అది ప్రచారం మాత్రమేనని.. టికెట్ తనకే  వస్తుందని అనుచరుల్లో భరోసా నింపే ప్రయత్నాన్ని చేశారు. అయితే టీడీపీ హైకమాండ్ ఆలోచన వేరేగా ఉందని తెలుసుకున్న కొమ్మాలపాటి అనుచరులు..ఇప్పుడు ఆత్మీయ సమావేశాలు పెట్టుకుని టికెట్‌ తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

కానీ పెదకూరపాడులో అన్నిరకాలుగా బలంగా ఉన్న నంబూరు శంకర్ రావును ఢీకొట్టడానికి కొమ్మాలపాటి సరిపోరన్న  టీడీపీ అధిష్ఠానం భావిస్తోంది. నంబూరిని డీకొట్టడానికి భాష్యం ప్రవీణే అక్కడ బలమైన అభ్యర్థి అవుతారని ఆలోచిస్తుందట. నారా లోకేష్ కు సన్నిహితుడిగా ఉన్న భాష్యం ప్రవీణ్.. గతంలో చిలకలూరిపేట నుంచి పోటీ చేయడానికి ప్రవీణ్ రెడీ అయ్యారు. కానీ ప్రత్తిపాటి పుల్లారావు గట్టిగా అడ్డుపడటంతో ప్రవీణ్ పెదకూరపాడుకు షిఫ్ట్‌ అవ్వాల్సి వచ్చింది.

వైసీపీ తరపున ఇప్పుడు నిలబడబోతున్న ఎమ్మెల్యే శంకర్ రావు, తాజాగా టీడీపీ నుంచి టికెట్‌ ఆశిస్తున్న ప్రవీణ్ వరుసకు మామా అల్లుళ్లు అవుతారు. ఇద్దరిది కూడా తాడికొండ మండలం పెదపరిమినే. దీంతో  రాబోయే ఎన్నికల్లో కొమ్మాలపాటిని తప్పిస్తే మాత్రం .. మామ అల్లుళ్ల మధ్య ఫైట్ తప్పేలా లేదని పెదకూరపాడువాసులు అనుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =