ఆ స్థానం నుంచి ఎంపీగా మాజీ సీఎం పోటీ

Lok sabha elections, nallari kiran kumar reddy, ap, bjp,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,AP Political updates,CM,Former CM,Rajampet,Mango News Telugu,Mango News
Lok sabha elections, nallari kiran kumar reddy, ap, bjp

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి. పొత్తులు, ఎత్తులు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనలో ప్రధాన పార్టీలన్నీ నిమగ్నమైపోయాయి. అయితే కొన్ని కీలక స్థానాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఆయా స్థానాల నుంచి ఏ పార్టీ తరుపున ఎవరు బరిలోకి దిగనున్నారనేది చర్చనీయాంశంగా మారింది. అందులో ఒకటి రాయలసీమలోని రాజంపేట పార్లమెంట్ నియోజవకర్గం. ప్రస్తుతం ప్రస్తుతం ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ తరుపున ఆయనే పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

అటు టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కూడా దోస్తీ కట్టేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. త్వరలోనే పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ అసెంబ్లీ స్థానాల కంటే.. పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా అడుగుతోందని.. అందులో రాజంపేట స్థానాన్ని కూడా అడుగుతున్నట్లు తెలుస్తోంది. 2014లో బీజేపీ-టీడీపీ పొత్తు ఉన్నప్పుడు కాషాయపు పార్టీ తరుపున దగ్గుబాటి పురందేశ్వరి ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈసారి పురందేశ్వరి కాకుండా మరో బలమైన నేతను రాజంపేట నుంచి బరిలోకి దించాలని బీజేపీ అనుకుంటోందట.

ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి దించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. వాస్తవానికి రాజంపేట కాంగ్రెస్‌కు కంచుకోట. గతంలో ఐదుసార్లు కాంగ్రెస్ తరుపున సాయిప్రతాప్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2014లో మాత్రం వైసీపీ రాజంపేటలో జెండా ఎగురవేసింది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 2014లో వైసీపీ తరుపున రాజంపేట నుంచి పోట చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు. ఈక్రమంలో వచ్చే ఎన్నికల్లో కూడా మిథున్ రెడ్డినే బరిలోకి దించాలని వైసీపీ అనుకుంటోంది.

అయితే మిథున్ రెడ్డిని ఢీ కొట్టాలంటే.. అది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితోనే సాధ్యమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. సుదీర్ఘ రాజకీయ అనుభవం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆయన్ను పోటీ చేయించాలని అనుకుంటున్నారట. అటు కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజంపేట నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. సెంట్రల్ కేబినెట్‌లో చోటు దక్కించుకోవచ్చని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE