పంతం నానాజీకి కాకినాడ రూరల్‌ టికెట్

Kakinada, janasena, ap elections, kakinada rural,tdp,jenasena,pawan kalyan,chandrababu,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Kakinada, janasena, ap elections, kakinada rural

టీడీపీ, జనసేన తొలి అభ్యర్థుల జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తొలి జాబితాలో భాగంగా 94 స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈసారి 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా.. పవన్ కళ్యాణ్ తొలి విడతలో 5 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారు. మిగిలిన స్థానాలకు కూడా అతి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇందులో కాకినాడ రూరల్ కు పంతం నానాజీ పేరును జనసేన అభ్యర్థిగా ప్రకటించడంతో ఇన్ని రోజులు సాగిన రెండు పార్టీల నేతల మధ్య జరిగిన పంచాయితీకి చెక్ పెట్టినట్లు అయింది.

అవును.. ఎందుకంటే ఏపీలో ఎన్నికలలో గెలుపును తమ ఖాతాలో వేసుకుని అధికారం సాధించడానికి అన్ని పార్టీలు విరామం లేకుండా వ్యూహాలు రచిస్తుంటే..సొంత పార్టీల నేతల తీరు వల్ల లేనిపోని తలనొప్పులు వచ్చి పడుతున్నాయి.   టీడీపీ,జనసేన పొత్తులో భాగంగా సీట్ల పంపకంపై ఇంకా ఓ క్లారిటీ రాకముందే, రెండు  పార్టీల నేతల మధ్య సీట్ల విషయంలో విభేదాలు మాత్రం తారా స్థాయికి చేరుకుంటున్నాయి.

ఇప్పుడు  రెండు పార్టీల నేతలు టికెట్ తమ కంటే తమకంటూ పెద్దఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే కాకినాడ రూరల్ టికెట్ విషయంలో తెలుగు దేశం పార్టీ, జనసేన నేతల మధ్య ఇప్పటి వరకూ సీరియస్ వార్ నడిచింది. తమను కాదని  జనసేనకి టికెట్ కేటాయిస్తే మాత్రం ఈ ఎన్నికలలో.. తాము చిత్తుగా ఓడిస్తామని హై కమాండ్‌కే అల్టిమేటం జారీ చేయడం  వరకూ వెళ్లింది.

తెలుగు దేశం నుంచి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కాకినాడ రూరల్ టికెట్ ఆశిస్తుండగా, జనసేన నుంచి పంతం నానాజీ సీటు తనకేనంటూ  ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. అనంతలక్ష్మి 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత..అనంత లక్ష్మి భర్త సత్యనారాయణతో పాటు టీడీపీలోని చాలా పదవులకు రాజీనామా చేసి, ఆ తర్వాత అందులోనే సామాన్య కార్యకర్తగానే ఉన్నారు. దీంతో అక్కడున్న ఇతర నేతలు కేడర్‌ను బలపరుచుకుంటూ టికెట్ కోసం ఆశలు పెంచుకున్నారు.

ఇటు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. అనంత లక్ష్మీ కుటుంబసభ్యులు మళ్లీ పార్టీలో యాక్టీవ్ అయి టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. వీరితో పాటు టీడీపీలో పెరుగుతున్న వర్గపోరుతో.. ఆమె గెలుపు కష్టమేనన్న లెక్కలతో జనసేనకే టికెట్ ఇస్తారని పార్టీ వర్గాల్లో  ప్రచారం జరిగింది.ఇలా ప్రచారం జరుగుతుండగానే..ఎవరికి వారు తమ కేడర్లతో ప్రచారం మొదలుపెట్టారు. అలా జనసేన నాయకులు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాల కోసం పార్టీ ఆఫీసు ప్రారంభించగా..  అనంతలక్ష్మి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కాకినాడ రూరల్ టికెట్ జనసేనకి కేటాయిస్తే మాత్రం చిత్తు చిత్తుగా ఓడిస్తామని మీడియా ముందే హెచ్చరించారు. కానీ దీనిపై అనంతలక్ష్మి దంపతులు మీడియా ముందుకు వచ్చి టికెట్ ఎవరికి వచ్చినా సపోర్టు చేస్తామని, టీడీపీని వీడే ప్రసక్తే లేదని చెప్పడం హాట్ టాపిక్ అయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =