టీడీపీ కంచుకోటలో ఏపీ సీఎం పర్యటన

AP CM Jagan, Peddireddy Ramachandra Reddy,AP Political updates , Kuppam Assembly constituency, YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan,Andhra Pradesh News Updates, AP Political News, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
AP CM Jagan, Peddireddy Ramachandra Reddy, Chandrababu , Kuppam Assembly constituency, YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు గెలుచుకుంటామని చెబుతూ వస్తున్న ఏపీ సీఎం జగన్ అదే  ధీమాగా చెబుతున్నారు. వై నాట్ 175 అనే నినాదాన్నే  వినిపిస్తూ, పార్టీ కేడర్లో ఉత్సాహం పెంచే ప్రయత్నిస్తున్నారు. తన ప్రచారాలతో ప్రజలకు,పార్టీ నాయకులకు దగ్గరవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ప్రచారాలు నిర్వహిస్తూనే పాటు , ఎన్నికలపై పూర్తిగా ఫోకస్ చేశారు.

ముఖ్యంగా టీడీపీ,జనసేన కీలక నేతలు పోటీ చేయబోయే నియోజకవర్గాలనే టార్గెట్‌గా వ్యూహాలు రచిస్తున్నారు. అలాగే నారా లోకేష్ బరిలో దిగుతున్న మంగళగిరి నియోజకవర్గం పైన , అలాగే పవన్ కళ్యాణ్ బరిలో దిగుతున్న భీమవరం నియోజకవర్గం పైన సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి పెడుతూ తన వ్యూహాలు రచిస్తున్నారు.అందుకే ఆ నియోజకవర్గాలలో  వైసీపీ నుంచి బలమైన అభ్యర్థులను బరిలో దింపడానికి ప్లాన్ చేస్తున్నారు.

అలా ఇప్పుడు తెలుగు దేశం పార్టీ  అధినేత చంద్రబాబు కంచుకోటగా ఉన్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. అక్కడ చంద్రబాబును కనుక ఓడించగలిగితే రాజకీయంగా వైసీపీకి మరింత గ్రాఫ్ పెరుగుతుందని  జగన్ భావిస్తున్నారు .కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఎలా అయినా ఓడించడమే టార్గెట్‌గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అక్కడ బాధ్యతలను అప్పగించారు. అలాగే అక్కడ ఎంఎల్సీ భరత్ ను వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు ఏ విషయంలో కూడా ప్రజల దగ్గర సానుకూలత దొరకకుండా పక్క ప్లాన్ ను జగన్ సిద్ధం చేశారు .

దీనిలో భాగంగానే ఫిబ్రవరి 26 న జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించడానికి ప్లాన్ చేసుకున్నారు. అంతే కాదు అక్కడ  త్వరలోనే హంద్రీనీవా నీటిని కుప్పం నియోజకవర్గ ప్రజలకు జగన్ అందించనున్నారు.  కుప్పంలో ఫిబ్రవరి 26న  జరిగే సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఆ సభలోనే ఆ నియోజకవర్గానికి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకువచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని చెప్పబోతున్నారు.

సభ జరిగిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో ఉన్న వైసీపీ కీలక నాయకులతో జగన్ సమావేశం కానున్నారు. ఈ భేటీ తర్వాత గుండి శెట్టిపల్లి వద్ద జరిగే బహిరంగ సభలోనూ  సీఎం జగన్ పాల్గొంటారు.  ఆ తర్వాత లోకల్ నాయకులతో సమావేశమవుతారు. ఆ భేటీలో వైసీపీ గెలుపు కుప్పం తోనే ప్రారంభం కావాలని..ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చిన జగన్.. ఇప్పుడు దీనిని అమలు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 9 =