మార్చి 17న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చిలకలూరిపేటలోని బొప్పూడిలో ప్రజాగళం సభ ఏర్పాటు చేస్తుందన్న దగ్గర నుంచి అందరి దృష్టీ అటే వెళ్లింది. ముఖ్యంగా ప్రధాని మోదీ ఈ సభకు హాజరవుతారనే విషయంతో మరింత ఆసక్తి పెరిగింది. ఎందుకంటే ఎదురుచూసారు. అయితే అంతా అనుకున్నట్లే జగన్ సర్కార్‌పై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా చెప్పాలంటే సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ మంత్రులు అవినీతి అక్రమాల్లో పోటీ పడుతున్నారని, వారంతా ఒకరిని మించి మరొకరు అవినీతి చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. జగన్ అవినీతి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెకిలించాలని మోదీ పిలుపునిచ్చారు. వైఎస్పార్సీపీ గవర్నమెంట్ ఉండటం వల్లే ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగలేదని ప్రధాని మండిపడ్డారు. అంతేకాదు.. ఏపీలో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ ఒక్కటేనని చెప్పిన ప్రధాని మోదీ.. ఈ రెండూ కుటుంబ పార్టీలేనని, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ మధ్య రహస్య స్నేహం ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్సీపీని గెలిపించడానికే కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. అందుకే ఏపీ ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయాలని.. ఎన్డీఏ కూటమికి ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తే ఎన్డీఏ కూటమికి కచ్చితంగా ఓటు వేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాబోయే ఎన్నికల్లో రెండు సంకల్పాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన ప్రధాని మోదీ.. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తొలి సంకల్పమని..ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి సర్కారుకు చరమగీతం పాడటం రెండో సంకల్పమని చెప్పారు. ఈ రెండు సంకల్పాలు నేరవేరితే దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతోందని జోస్యం చెప్పారు. మొత్తంగా వైసీపీ నేతలు కూడా ఊహించని విధంగా ప్రధాని మోదీ జగన్ సర్కార్ పై చేసిన మాటలు హాట్ టాపిక్‌గా మారాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE