ఏపీలో థర్డ్‌ జెండర్ ఓటర్లు ఎంతమంది?

How Many Third Gender Voters In AP?, Third Gender Voters In AP, AP Third Gender Voters, Third Gender Voters, Third Gender Voters In AP, Supreme Court, Election Commission, Transgenders, Women Voters, Male Voters, BSP, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
third gender voters in AP,Supreme Court, Election Commission, Transgenders, Women Voters, Male Voters,BSP,

ఎన్నికలు ఎప్పుడొచ్చినా  ఆయా నియోజవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలలో ఉండే ఓటర్లు ఎంతమందనే లెక్క బయటకు వస్తుంటుంది. అయితే చాలామంది మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు అంటూ లెక్కలు చెబుతారు కానీ థర్డ్ జెండర్ విషయాన్ని మరిచిపోతారు. హిజ్రాలు, ట్రాన్స్‌ జెండర్లుగా పిలవబడ్డ వారికి సుప్రీం కోర్టు ఒక గౌరవం ఇస్తూ థర్డ్‌ జెండర్లుగా గుర్తించగా..  ఎన్నికల సంఘం కూడా వారికి థర్డ్‌ జెండరుగా గుర్తిస్తూ ఓటు హక్కు కల్పించింది.

దీంతో  తెలంగాణతో పాటు దేశంలో చాలా చోట్ల థర్డ్ జెండర్లు  రాజకీయాలలో కూడా సంచలనాలు సృష్టిస్తున్నా..ఏపీలో మాత్రం అడుగులు పడటం లేదన్న చర్చ ఎన్నికల సందర్భంగా నడుస్తోంది . 1994లో ట్రాన్స్ జెండర్లకు తొలి సారి ఓటు హక్కు కల్పించినా..వారిని  మహిళలుగానే గుర్తించి ఓటు హక్కును కల్పించారు. 2009లో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని వారిని థర్డ్‌ జెండర్‌గా గుర్తించింది.

ఏపీలో మొత్తం 3,482 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. ముమ్మిడి వరం, నర్సాపురం అసెంబ్లీ నియోజక వర్గాలలో తప్ప అన్ని నియోజక వర్గాల్లోనూ థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. కాకినాడలో 94 మంది, రాజమండ్రిలో 58 మంది, భీమవరంలో 50 మంది, విజయవాడ సెంట్రల్లో 50మంది, నెల్లూరు సిటీలో 66 మంది, కడపలో 88 మంది, ప్రొద్దుటూరు 51 మంది, పాన్యంలో 75 మంది, నంద్యాల్లో 94 మంది, డోన్‌లో 69 మంది, గుంతకల్‌లో 76 మంది, చంద్రగిరిలో 60మంది చొప్పున ఉన్నారు.

అత్యల్పంగా కొన్ని నియోజక వర్గాల్లో ఒకరు చొప్పున  ఉన్నారు. సాలూరులో  నలుగురు, నెలిమర్లలో ముగ్గురు, పాయకరావుపేటలో ఇద్దరు ఉన్నారు. అమలాపురం, రాజోలు వంటి నియోజక వర్గాల్లో ఒక్కొరు చొప్పున ఉన్నారు. 2021లో స్థానిక ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఓటర్ల జాబితాలో ఏపీ  వ్యాప్తంగా 4,135 మంది థర్డ్‌ జెండర్లు ఉన్నారు. అలాగే.. 2011 సెన్సెస్‌ ప్రకారం ఏపీలో 22,759 మంది ట్రాన్స్‌ జెండర్లు ఉన్నారు.

తెలంగాణలో సుమారు 50వేలకుపైగా థర్డ్ జెండర్లు ఉండగా వారిలో 2,557 మంది ఓటర్లు ఉన్నారు. గతేడాది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఒక ట్రాన్స్‌ జెండర్‌ లైలాను ప్రత్యేక అంబాసిడర్‌గా ఎన్నికల కమిషన్‌ నియమించడం హాట్ టాపిక్ అయింది. అలాగే తెలంగాణలో  2014లో తొలి సారి ట్రాన్స్‌ జెండర్‌ దోమల మేరీ స్వతంత్ర అభ్యర్ధిగా ఎన్నికల బరిలోకి దిగారు. అలాగే 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి పుష్పలత అనే ట్రాన్స్‌ జెండర్‌కు బీఎస్పీ అవకాశం కల్పించింది.అలాగే 2018 ఎన్నికల్లో బహుజన ఫ్రంట్‌ పార్టీ నుంచి  గోషామహల్‌ నియోజక వర్గంలో చంద్రముఖి పోటీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − five =