ఆ సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తున్న వైసీపీ

Jagan Focus on Pitapuram, Jagan Focus, Pitapuram Jagan Focus, Pitapuram, YCP,TDP, Janasena, Congress, BJP, Pitapuram Political News, Pawan Kalyan, CM Jagan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Pitapuram,Jagan focus on Pitapuram,YCP,,TDP, Janasena, Congress, BJP,

ఎప్పుడయితే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నుంచి  పోటీ చేస్తున్నానని ప్రకటించారో..అప్పటి నుంచి పిఠాపురంపై సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే ఎంపీ వంగా గీతను అక్కడ తమ అభ్యర్థిగా ఖరారు చేసిన వైఎస్సార్సీపీ తాజాగా పిఠాపురంలో సామాజిక వర్గాలవారిగా ఎలక్షన్‌ వర్క్‌‌ను షురూ చేసింది. నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ ఓట్లు ఎన్ని ఉన్నాయంటూ ఎంక్వైరీలు చేస్తోంది. పిఠాపురంలో సుమారు 85,000 బీసీ ఓట్లు ఉన్నాయి.. అందులో మత్స్యకారులు 30,000, శెట్టిబలిజ 30 వేలు, పద్మశాలి ఓట్లు 20,000 ఉన్నాయి.

నియోజవర్గంలో మొత్తం 2 లక్షల 30 వేల ఓట్లు ఉంటే.. అందులో  దాదాపు 95,000 కాపుల ఓట్లు.. 30,000 ఎస్సీ ఓట్లు  ఉన్నాయి. దీంతో బీసీ, ఎస్సీ ఓట్లు టార్గెట్ గా ఎన్నికలలో వెళ్లడానికి అధికార పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పవన్ కల్యాణ్‌ వల్ల కాపుల ఓట్లు చీలతాయన్న లెక్కలు వేసుకున్న జగన్..పవన్‌ను ఎదుర్కోవడానికి ఈ ఫార్ములా వర్కౌట్ చేయడానికి పావులు కదుపుతున్నారు.

ఇప్పటికే  జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కే  కాపుల ఓట్లు  అన్న లెక్కలు  వైసీపీ అధిష్టానానికి అందడంతో.. ఆ రెండు సామాజిక వర్గాలలో మెజార్టీ ఓట్లును తమ వైపు లాక్కొంటే గెలుపు ఈజీ అవుతుందని వైసీపీ అంచనా వేస్తోంది.దీనిపైనే తాజాగా  ఉప్పాడ కొత్తపల్లిలో మత్స్యకారులతో  మంత్రి దాడిశెట్టి రాజా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అయితే తామంతా పవన్ వైపేనని మత్స్యకారులు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు  గొల్లప్రోలు, ఉప్పాడ, కొత్తపల్లి మండలాలపై కూడా  అధికార పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. చేనేత మగ్గం పనులు చేసే పద్మశాలీలకు వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి లబ్ధి చేకూరిందో  వివరిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు  నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే చేనేత సంఘాలతో కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతున్నారు. అయితే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు చెక్ పెట్టే విధంగా అడుగులు ముందుకు వేద్దామన్న  అధికార పార్టీకి.. అడుగడుగునా  అడ్డంకులు ఎదురవుతున్నట్లే కనిపిస్తున్నాయన్న ప్రచారం జరుగుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE