పెమ్మ‌సాని ప్లానింగ్‌కు గుంటూరు ఫిదా!

Guntur Fida for Pemmasani Planning!, Pemmasani Planning, Guntur Fida, Guntur Planning, Guntur Loksabha, Pemmasani, TDP, AP State Elections, Latest Guntur Political News, Guntur News, CM Jagan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Guntur Loksabha , Pemmasani , TDP , AP State elections ,

ఆయ‌నో ఎన్నారై. విద్య‌, వ్యాపార రంగాల్లో అమెరికాలో స్థిర‌ప‌డ్డాడు. రియ‌ల్ శ్రీ‌మంతుడు. స‌క‌ల సౌక‌ర్యాలు ఉన్న అదృష్ట‌వంతుడు. అయినా.. ఇంక నాకేం త‌క్కువ అనుకోలేదు. అలాగ‌ని.. డ‌బ్బు సంపాద‌న‌లో ఇంకా ఎద‌గాల‌నీ ఆశించ‌డం లేదు. ఇంకా.. ఉన్న‌దాంట్లో అంద‌రికీ పంచేస్తున్నాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని గుంటూరు, న‌ర‌సారావుపేట‌, నెల్లూరు త‌దిత‌ర ప్రాంతాల్లో సేవా కార్య‌క్రమాలు ఎన్నో చేప‌ట్టాడు. ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందాడు. ఆ సంతృప్తితో ప్ర‌జ‌ల‌కు ఇంకా మేలు చేసేందుకు రాజ‌కీయాల‌పై దృష్టి సారించాడు.. అత‌డే డాక్ట‌ర్ పెమ్మ‌సారి చంద్ర‌శేఖ‌ర్‌. తెలుగుదేశం కూట‌మి గుంటూరు లోక్‌స‌భ అభ్య‌ర్థి.

సొంత గ‌డ్డ‌పై అడుగుపెట్టక‌ ముందు నుంచే.. అమెరికా ఎన్నారై విభాగంలో చురుగ్గా ఉండే పెమ్మ‌సాని.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి  అడుగుపెట్టారు. అప్ప‌టికే తెలుగుదేశం పార్టీలో కీల‌కంగా ఉన్న పెమ్మ‌సానికి గుంటూరు లోక్‌స‌భ టికెట్ ఇస్తున్న‌ట్లు అధినేత చంద్ర‌బాబునాయుడు భ‌రోసా ఇచ్చారు. అధినేత భ‌రోసాతో పెమ్మ‌సాని నియోజ‌క‌వ‌ర్గంలో దూకుడు పెంచారు. ఇక్క‌డి వాతావ‌ర‌ణాన్ని, రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను పూర్తిగా అధ్య‌య‌నం చేశారు. నాలుగు నెల‌ల కాలంలోనే గుంటూరు లోక్‌స‌భ ప‌రిధిలోని అన్ని ప్రాంతాల‌లోని స‌మ‌స్య‌ల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించారు. ఎక్క‌డిక‌క్క‌డ అన్నింటినీ నోట్ చేసుకుంటున్నారు. ఏ స‌మ‌స్య ప‌రిష్కారానికి ఎన్ని రోజులు ప‌డుతుందో ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నారు. అధికారంలోకి వ‌స్తే ఎప్పుడు, ఏ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తానో.. టైంతో స‌హా ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. దీంతో పెమ్మ‌సానిపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పెరుగుతోంది.

త‌మ‌కోసం స‌ర్వ‌సుఖాల‌ను వ‌దిలి.. అమెరికా నుంచి సొంత గ‌డ్డ‌పై అడుగుపెట్టి.. పెమ్మ‌సాని క‌ష్ట‌ప‌డుతున్న తీరుకు మంత్ర‌ముగ్దులై గుంటూరు లోక్‌స‌భ‌కు చెందిన మెజారిటీ ప్ర‌జ‌లు ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. ఇంత‌లా త‌న‌ను ఆద‌రిస్తున్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పెమ్మ‌సాని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఇప్ప‌టికే గుంటూరు పార్ల‌మెంట్ ప‌రిధిలో మేజ‌ర్ స‌మ‌స్య‌ల‌ను గుర్తించారు. అందులో ప్ర‌ధాన‌మైన తాగునీటి స‌మస్య ప‌రిష్కారానికి ఎప్ప‌టినుంచో త‌న‌వంతు సాయం అందిస్తున్నారు. ట్యాంక‌ర్ల ద్వారా నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. వందకు పైగా బోర్లు వేయించారు. అధికారంలోకి వ‌స్తే పూర్తిస్థాయిలో ప‌రిష్కారానికి సిద్ధం అవుతున్నారు.

త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న ప్ర‌జ‌ల్లో ఎక్కువ మందికి దంతాల‌పై ఫ్లోరైడ్ వ‌ల్ల మ‌ర‌క‌లు ఏర్ప‌డిన‌ట్లు గుర్తించిన పెమ్మ‌సాని.. ఆ స‌మ‌స్యకు చికిత్స అందించేందుకు రెడీ అయ్యారు. ఎక్క‌డికైనా ప్ర‌యాణించాలంటే.. గుంటూరు న‌గ‌ర మధ్య‌లోని రైల్వేట్రాక్ వ‌ల్ల వాహ‌న‌దారులు 20 నుంచి 30 నిమిషాలు నిరీక్షించాల్సి వ‌స్తోంద‌ని, ద‌శాబ్దాల నాటి వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించాల్సి ఉంద‌ని, దాంతో పాటు భూగ‌ర్భ డ్రైనేజీ స‌మ‌స్య తీవ్రంగా ఉంద‌ని పెమ్మ‌సాని గుర్తించారు. ఆరు నెల‌ల్లోనే స‌మస్య‌లన్నింటిపైనా స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేసి.. ప్రాధాన్య‌తాప‌రంగా ప‌రిష్క‌రించేందుకు డాక్ట‌ర్ పెమ్మ‌సాని సిద్ధంగా ఉన్నారు. అమెరికా నుంచి వ‌చ్చిన 4 నెల‌ల్లోనే 40 ఏళ్లుగా కొన‌సాగుతున్న స‌మ‌స్య‌ల‌ను కూడా గుర్తించి, ప‌రిష్కారానికి సిద్దం అవుతున్న పెమ్మ‌సాని ప్లానింగ్‌కు గుంటూరువాసులు ఫిదా అవుతున్నారు. తాము స‌దా పెమ్మ‌సానితోనే ఉంటామ‌ని.. మ‌న‌స్ఫూర్తిగా తెలియ‌జేస్తున్నారు. జై తెలుగుదేశం.. జైజై పెమ్మ‌సాని అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 14 =