మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ – నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో మంత్రి అంబటి రాంబాబు

AP Minister Ambati Rambabu Interesting Comments on CM Jagan in YSRCP Plenary Meeting at Nellore, Minister Ambati Rambabu Interesting Comments on CM Jagan in YSRCP Plenary Meeting at Nellore, Ambati Rambabu Interesting Comments on CM Jagan in YSRCP Plenary Meeting at Nellore, YSRCP Plenary Meeting at Nellore, Nellore YSRCP Plenary Meeting, YSRCP Plenary Meeting, Interesting Comments on CM Jagan, Sensational Comments on CM Jagan, Andhra Pradesh Irrigation Minister Ambati Rambabu, AP Irrigation Minister Ambati Rambabu, Minister Ambati Rambabu, AP Irrigation Minister, Irrigation Minister, Ambati Rambabu, Nellore YSRCP Plenary Meeting News, Nellore YSRCP Plenary Meeting Latest News, Nellore YSRCP Plenary Meeting Latest Updates, Nellore YSRCP Plenary Meeting Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గురువారం నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రిపై కొన్ని కామెంట్స్ చేశారు. జిల్లాలోని వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్, ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలోనే లేరని అన్నారు. మానిఫెస్టోలోని హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే ఎమ్మెల్యేలను జనం వద్దకు వెళ్ళమని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి రాంబాబు తెలిపారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అందరికీ అందలేదని, పక్షపాతం చూపించారని రాంబాబు అన్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలు, కులాలు, మతాలు ఏవీ చూడకుండా అర్హులైనవారందరికీ అందిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే 2024 ఎన్నికల్లో మళ్ళీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావడం ఖాయమని, దీనిని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇక ఈ ప్లీనరీ సమావేశానికి అంబటితో పాటు మరో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మెన్లు తదితరులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here