ఇద్దరు సీనియర్ల మధ్య పోరు

Political Heat in Rajampet, Political Heat, Rajampet, Rajampeta Politics, Political Heat in Rajampet, Mithun Reddy, Nallari Kiran Kumar YSPARCP, TDP, Jana Sena, BJP, Congress, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Rajampeta Politics,Political heat in Rajampet,Mithun Reddy, Nallari Kiran Kumar YSPARCP, TDP, Jana Sena, BJP, Congress

ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట బరిలో ప్రస్తుతం జరుగుతున్న ఇద్దరు వారసుల మధ్య పోరు పొలిటికల్ హీటును పెంచేస్తోంది.  మాజీ ముఖ్యమంత్రి, వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన  నేతల మధ్య సాగుతున్న ఎన్నికల ప్రచార వర్వం,  విమర్శనాస్త్రాలతో రాజంపేట పాలిటిక్స్‌ వైపు అందరి చూపును పడేలా చేస్తోంది.

దీంతో   రాజంపేటలో జరగనున్న ఎన్నికల వైపు రాష్ట్రమంతటా ఆసక్తికర చర్చ నడుస్తోంది.ఒకవైపు కూటమి అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పోటీ చేస్తుండగా..అధికార వైఎస్పార్సీపీ  క్యాండిడేట్‌గా సిట్టింగ్‌ ఎంపీ మిథున్‌రెడ్డి పోటీకి  దిగుతున్నారు. ఇప్పటికే ఇద్దరు నేతలు ప్రచారాలలో దూసుకుపోతున్నారు. కూటమి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రకటించిన తర్వాత .. అన్నమయ్య జిల్లాలోని  కలికిరి మండలం నగిరిపల్లిలో ఆయన  తొలిసారి పర్యటించారు .

వైసీపీ టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించిన కిరణ్ కుమార్ రెడ్డి.. రాజంపేట, పుంగనూరుకు పెద్దిరెడ్డి కుటుంబం చేసిందేమీలేదని అన్నారు. రాజకీయాన్ని వారంతా కేవలం డబ్బు సంపాదించడం కోసమే వాడుకున్నారని .. ప్రభుత్వాన్ని మోసం చేయడమే కాకుండా..ప్రజాధనాన్ని లూటీ చేశారని కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్  ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని.. అప్పు చేయకుంటే ప్రస్తుతం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని విమర్శించారు కిరణ్‌కుమార్‌రెడ్డి.

మరోవైపు పుంగనూరు, రాజంపేట అభివృద్ధి చెందాయంటే అది పెద్దిరెడ్డి, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి చలువే అంటూ కిరణ్‌కుమార్‌రెడ్డికి  వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు వైఎస్సార్సీపీ సమన్వయ సమావేశానికి హాజరయిన ఆయన.. ఒకాయన సూట్‌కేస్‌తో సహా వచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేయడానికి వచ్చారంటూ కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి సెటైర్ వేశారు. జూన్‌ నాలుగు తర్వాత ఆయన మళ్లీ అదే సూటుకేసుతో తిరిగి వెళ్లేలా ఇక్కడి ప్రజలు తీర్పు ఇస్తారని కామెంట్ చేశారు.

కూటమి అండతో గెలుస్తానని మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి.. రెండుసార్లు వరుసగా గెలిచిన ధైర్యంతో ఎంపీ మిథున్‌రెడ్డి ఎవరికి వారే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే..  కిరణ్‌కుమార్‌రెడ్డి  తన  ఫస్ట్‌ ఎంట్రీతోనే వైఎస్సార్సీపీని టార్గెట్‌ చేయగా.. అదే స్థాయిలో కిరణ్ కుమార్ రెడ్డిపై  కౌంటర్‌ ఇచ్చి కాక రేపారు మిథున్‌రెడ్డి.మొత్తంగా కూటమి, వైఎస్సార్సీపీ నేతల మాటల హీటుతో, పోటాపోటీ ప్రచారాలతో రాజంపేట రాజకీయం రసవత్తరంగా మారుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY