ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఏం జరుగుతోంది?

What Is Happening In Etcherla Constituency?, Etcherla Constituency, Srikakulam Etcherla TDP Leaders, TDP Leaders Kala Venkat Rao, Appalanaidu Angry For Chandrababu, Chandrababu Giving Ticket To BJP, Chandrababu, Etcherla Constituency News, Srikakulam, Kala Venkat Rao, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
srikakulam Etcherla tdp leaders kala venkat rao appalanaidu angry for chandrababu for giving ticket to bjp telugu news

కుల సమీకరణలను లెక్కలోకి తీసుకోని అభ్యర్థిని నిలబెట్టడం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనూ సర్వసాధారణ విషయం. కాపు కులస్తులు భారీగా ఉన్న పిఠాపురం నుంచి పవన్‌ అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడడానికి కారణం అదే అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు జనసేన-బీజేపీ-టీడీపీ కూటమిలో అభ్యర్థిల ఎంపిక పలు చోట్ల షాక్‌కు గురి చేసేలా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు తూర్పు కాపులే. ఆ సామాజిక వర్గానికి చెందిన కిమిడి కళా వెంకటరావు, కలిశెట్టి కూటమి అభ్యర్థులగా టికెట్ ఆశించారు. అయితే ఊహించని విధంగా కమ్మ కులానికి చెందిన ఈశ్వరరావును కూటమి అభ్యర్థిగా నిలబెట్టడం ఎచ్చెర్ల నాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొత్తులో భాగంగా ఆయన బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు.  గతేడాది కాలంగా కిమిడి కళా వెంకటరావు, కలిశెట్టి అప్పలనాయుడు ఇద్దరూ ఎచ్చెర్ల టికెట్ కోసం గట్టిగానే పట్టుబట్టారు.

ఎచ్చెర్లను బీజేపీకి కేటాయిస్తూ కూటమి పెద్దలు తీసుకున్న నిర్ణయం టీడీపీ సీనియర్ నేత, కాపు నేత కళా వెంకటరావుకు కోపం తెప్పించింది. ఉనుకూరు గ్రామానికి చెందిన కళా వెంకటరావు ఎచ్చెర్ల నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక 2009 ఎన్నికల నుంచి రాజాం ఎస్సీలకు రిజర్వు కావడంతో ఆయన ఎచ్చెర్లపైనే ఎక్కువగా ఫోకస్‌ ఉంచుతారు.

నియోజకవర్గంలో ఊహించని రాజకీయ ట్విస్టులను వెంకటరావు అనుచరులు, అప్పలనాయుడుతో పాటు కాపు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆకస్మిక రాజకీయ పరిణామాలపై రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, జిసిగడాం టీడీపీ మండల స్థాయి నాయకులు అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారంతా ఇప్పుడు కొత్త అభ్యర్థి ఈశ్వరరావుకు సహకరిస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. తక్కువ సమయంలోనే నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తలను ఒప్పించడం తమకు కష్టమైన పనేనన్నది వీరిలో చాలామంది వాదన. ఇద్దరూ పోటి పడిన చోట ఆ ఇద్దరికి కాకుండా మూడో వ్యక్తికి టికెట్‌ ఇవ్వడం సరైనది కాదన్నది వారి అభిప్రాయం. వెంకటరావు, అప్పలనాయుడు ఈ ఇద్దరు నేతల్లో ఎవరికైనా టికెట్ ఇస్తారని పార్టీ నేతలు భావించగా.. అది సీన్‌ రివర్స్‌ అయ్యేసరికి కొత్త అభ్యర్థికి మద్దతు కరువైందన్న ప్రచారం మొదలైంది. ఇలా కూటమిలో అసమ్మతి జ్వాలలను చల్లార్చడం పార్టీ అధిష్టానానికి పెద్ద పనిగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 9 =