చౌదరి రెబల్‌గా పోటి చేసి టీడీపీకి షాక్ ఇస్తారా?

What Is Chandrababu's Strategy For Fielding A New Candidate In Anantapur?, A New Candidate In Anantapur, Anantapur, Strategy For Fielding A New Candidate In Anantapur, New Candidate In Anantapur, Anantapuram Politics, Prabhakar Chowdary Fights, Amind Elections, Anantapuram, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
anantapuram politics prabhakar chowdary fights with chandrababu continues amind elections telugu news

అనంతపురంలో టీడీపీ అంతర్గత యుద్ధం కొనసాగుతూనే ఉంది. సీటు ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వెనక్కి తగ్గడంలేదు. చంద్రబాబుతో తాడోపెడో తేల్చుకుంటున్నారు. అనంతపురం సీటును చంద్రబాబు అమ్ముకున్నారని బహిరంగగానే నిప్పులు చెరుగుతున్నారు. నిన్నమొన్నటి వరకు చంద్రబాబును పల్లెత్తు మాట అనని ప్రభాకర్ చౌదరి ఇప్పుడు వాయిస్‌ మొత్తం మార్చేశారు. అన్ని అంచనాలకు భిన్నంగా టీడీపీ, జనసేన పార్టీల్లోని సీనియర్లను పక్కన పెట్టి మరి అనంతపురం అసెంబ్లీ స్థానానికి కొత్త వ్యక్తిని అభ్యర్థిగా టీడీపీ బరిలోకి దింపడం సంచలనం రేపింది.

దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టింది. రాప్తాడు నియోజకవర్గ మండల అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. నిజానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ కూడా అనంతపురం ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. ఈ స్థానాన్ని టీడీపీ తన మిత్రపక్షమైన జనసేనకు వదిలేస్తుందని పవన్‌ టీమ్‌ కూడా మొదట్లో భావించింది. ఈ సీటు కోసం ప్రభాకర్ చౌదరి, వరుణ్ ఇద్దరూ తీవ్ర లాబీయింగ్ చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు టికెట్ ఇచ్చి అందరిని షాక్‌కు గురి చేశాయి. అయితే ఈ నిర్ణయం పార్టీ కింది స్థాయి నేతలకు గుర్తింపు ఇచ్చేలా ఉందని పలువురు తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. ఇది స్వాగతించాల్సిన విషయమేనంటున్నారు.

మొత్తానికి చంద్రబాబు నిర్ణయం మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని కలలు కంటున్న ప్రభాకర్ చౌదరికి నిరాశనే మిగిల్చింది. మరోవైపు నాలుగుసార్లు ఎంపీగా గెలిచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తన ప్రత్యర్థి అనంత వెంకట్రామారెడ్డికి వెంకటేశ్వర ప్రసాద్‌ ఏమాత్రం పోటి ఇవ్వాలేరన్న ప్రచారం జరుగుతోంది. అనంత వెంకట్రామారెడ్డి రాజకీయ చతురతకు, వ్యూహాలకు ప్రభాకర్ చౌదరి మాత్రమే సరితూగలరన్న టాక్‌ నడుస్తోంది. ఇక చౌదరి అనుచరులు వెంకటేశ్వర ప్రసాద్ గెలుపు కోసం పని చేసే ఆలోచనలో లేనే లేరు. ప్రభాకర్ చౌదరి 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి అనంత వెంకట్రామారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. 2014లో మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సారి టికెట్‌ రాకపోవడంతో ప్రభాకర్‌ చౌదరి ఇండిపెండెంట్‌గా పోటి చేస్తారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ అభ్యర్థి అనంత వెంకట్రామారెడ్డిపై పోరుకు వెంకటేశ్వరప్రసాద్ కూటమిలోని అన్ని వర్గాల మద్దతును ఏ మేరకు కూడగట్టగలరో చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 2 =