ఇప్పుడు ఏ ఇద్దరు విద్యావేత్తలు కలిసినా ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే సంక్షోభంలో చిక్కుకుందన్న విషయంపైనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలో పాలన అయోమయంగా మారిందంటూ.. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం అందరి ముందు అభాసుపాలుజేసేలా ఉందంటూ ఆవేదన కనిపిస్తోంది . అందుకే అందరి కోసం రాష్ట్రాన్ని బాగు చేసే కర్తవ్యాన్ని పవన్ కళ్యాణ్ స్వీకరించారన్న వాదన వినిపిస్తోంది. మళ్లీ ఏపీని గాడిలో పెట్టేందుకు కృషి చేశారని.. తొలి అడుగు పడిందని.. రాష్ట్రానికి శుభసూచికం కాబోతోందని హర్షం కనిపిస్తోంది.
నిజమే ఏపీలోని ఆటో కార్మికులకు ఏటా పదివేలు అకౌంట్లో వేస్తున్నారు. వాహనమిత్ర పేరుతో చేసిన సహాయం వాహనాల మరమ్మత్తు ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మార్చేసి వాహనాలు ధ్వంసం కావడానికి కారకులుగా మారిన ప్రభుత్వం మళ్లీ వాహనదారులను ఉద్దరించినట్టు చెప్పుకుంటోంది. ఓ చేత్తో సాయం చేసి రెండో చేత్తో దగా చేస్తోంది. సాయం కన్నా మించి జనం జేబులు కొట్టేస్తోంది. ఇది సామాన్యుడు గుర్తించకుండా ప్రచారం మాటున మభ్యపెడుతోంది. దేశంలోనే ఎక్కడా లేని రీతిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసి జేబులు కొడుతోంది.
ఒక్క వాహనమిత్రనే కాదు..అన్ని పథకాలు ఇదే తంతు. అన్నింటా ఇదే వైఖరి. పది పైసలు చేతిలో పెట్టి, రూపాయి గుంజేస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో మేలు చేస్తున్నట్టు ఎదురుగా కనిపించి, కుడి ఎడమల దగా దగా అన్నట్టు మూడు వైపులా మోసం చేస్తున్న మాయదారి జగన్ పాలనను జనం గ్రహించారు. ధరలన్నీ పెంచేసి దగా చేస్తున్న తీరు గుర్తించారు. పథకాల మాటున సాగుతున్న నయవంచన అర్థం చేసుకున్నారు. ధరల పెరుగుదల, పన్నుల మోత, అస్తవ్యస్త విధానాలతో అందరినీ ముంచేస్తున్న తీరు తెలిసిపోయింది. అందుకే ప్రజల పక్షాన పనిచేస్తూ, నిజమైన రాష్ట్రాభివృద్ధి సాధనలో జనసేన కీలకం కాబోతోందనే నమ్మకం ఏపీ వాసుల్లో పెరుగుతోంది.
ఆర్థికంగానూ రాష్ట్రం అధోగతి పాలవుతోంది. 12 లక్షల కోట్లకు చేరుతున్న అప్పులతో ప్రతీ వ్యక్తికి తలకు లక్షల రూపాయల అప్పుని మిగిల్చిన అవినీతి పాలనను తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్న వాదన ఇప్పుడు ఏపీ ఓటర్లలో వినిపిస్తోంది. ఐదేళ్లలో 8 లక్షల కోట్లు అప్పులు చేసి కేవలం రెండున్నర లక్షల కోట్లు ప్రజలకు పంచితే మిగిలిన ఆరు లక్షల కోట్లు ఎవరి మింగేశారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంత బాహాటంగా దోపిడీ చేసిన పాలనను జనం అర్థం చేసుకోలేరనే అపోహల్లో ఎందుకున్నారంటూ ఏపీ ప్రజలు చర్చిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకోకుండా కాపాడుకోవడం ఇప్పుడు అధికార పార్టీకి ప్రత్యామ్నాయం అవసరమని అంతా భావిస్తున్నారు. దివాళా దిశలో ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం అత్యవసరం కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్న జనసేనకు చేయూత నిద్దామనే వాదన వినిపిస్తోంది. ఒక్క ఛాన్స్ పేరుతో మోసపోయిన దానికి ప్రాయచ్ఛిత్తం చెల్లించి, ప్రజా సంక్షేమ పాలన, రాష్ట్రాభివృద్ధి కోసం జనసేన మిత్రపక్షాలను ఆదరిద్దామనే ఆలోచనకు ప్రజలు చేరుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY