ఆ నేత త్యాగంతో రఘురామకు లైన్‌ క్లియర్.. జోష్‌లో ఆర్ఆర్ఆర్ వర్గీయులు

With That Leaders Sacrifice The Line Is Clear For Raghurama, With That Leaders Sacrifice, Line Is Clear For Raghurama, Raghuramakrishnam Raju Line Is Clear, AP, TDP, Raghuramakrishnam Raju, Elections, Leaders Sacrifice, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
AP, TDP, Raghuramakrishnam raju, elections

రఘురామ టికెట్ ఎపిసోడ్‌ సుఖాంతం అయ్యేలాగే కనిపిస్తోంది. అయితే తాను అనుకున్న నర్సాపురం నుంచి కాదు కానీ వేరే నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణంరాజును పోటికి దింపాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రఘురామ కోసం ఓ నేతను తన టికెట్ త్యాగం చేయమని చంద్రబాబు అడిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి నర్సాపురం నుంచి రఘురామ మరోసారి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్లింది. దీంతో రఘురామకు బీజేపీ నుంచి ఎంపీ టికెట్ వస్తుందని అంతా భావించారు. అయితే వైసీపీకి అప్పటికీ రఘురామ రాజీనామా చేయలేదు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వం కూడా తీసుకోలేదు. మరి ఏ కారణంతోనో తెలియదు కానీ బీజేపీ ఈ ఆర్‌ఆర్‌ఆర్‌ను పట్టించుకోలేదు.  భూపతి శ్రీనివాస వర్మను అక్కడ నుంచి పోటికి దింపాలని నిర్ణయించింది.

ఒప్పుకోని వర్మ:

తనకు నర్సాపురం టికెట్ దక్కకపోవడంతో విజయనగరం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటి చేయాలని రఘురామ భావించారు. ఈ విషయమై చంద్రబాబుతో మాట్లాడినట్టు సమాచారం. అయితే ఆ సీటు కూడా ఆయనకు దక్కలేదు. దీంతో తాను ఎలాగైనా నర్సాపురం నుంచే పోటి చేస్తానని.. బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకుంటుదని ఆర్‌ఆర్‌ఆర్‌ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే నరసాపురం సీటుకు బదులుగా టీడీపీ ఏలూరు లోక్‌సభ సీటును భూపతి శ్రీనివాస వర్మకు ఆఫర్ చేసినప్పటికీ ఆయన అందుకు అంగీకరించలేదని సమాచారం. దీంతో చంద్రబాబు ప్లాన్‌ మార్చుకోవాల్సిందని తెలుస్తోంది.

ఉండి సీటు ఆర్‌ఆర్‌ఆర్‌కు?

అటు ఉండి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటిలోకి దిగుతున్న మంతెన వెంకట సత్యనారాయణ ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం సీటును వదులుకునే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఈ సీటు త్యాగం చేయాల్సిందిగా చంద్రబాబు సత్యనారాయణను అడిగినట్టుగా తెలుస్తోంది. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేతో చంద్రబాబు చర్చలు జరిపారని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన రాజకీయ ప్రయోజనాలను చూసుకుంటానని హామీ ఇచ్చారని సమాచారం. వీలైనంత త్వరగా రాష్ట్ర శాసనమండలికి నామినేట్ చేస్తానని టీడీపీ అధినేత సత్యనారాయణకు  హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. నరసాపురం పార్లమెంటరీ పరిధిలో ఉండి నియోజకవర్గం కూడా ఉండడంతో రఘు రామకృష్ణరాజును అక్కడ నుంచి రంగంలోకి దింపడం ఎన్డీయే మిత్రపక్షాలకు చాలా వరకు ఉపయోగపడుతుందని చంద్రబాబునాయుడు భావిస్తున్నారని టాక్. దీని గురించి మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =