విశాఖ నార్త్ నుంచే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ

Former CBI JD Lakshminarayana Is Contesting From Visakhapatnam, JD Lakshminarayana Is From Visakhapatnam, Visakhapatnam Candidate, Former CBI JD Lakshminarayana, Visakhapatnam, First List Released , Jai Bharat National Party, AP CM Jagan, AP, Janasena, YSRCP, TDP, BJP, Andhra Pradesh, Political News, Mango News, Mango News
Former CBI JD Lakshminarayana, Visakhapatnam, First list released ,Jai Bharat National Party,Ap Cm Jagan, Ap, Janasena, Ysrcp, TDP, BJP

ఏపీలో వైఎస్సార్సీపీ, టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించేశాయి.  కాంగ్రెస్ పార్టీ  ఫస్ట్ జాబితాలోనే చాలామంది అభ్యర్థులను ప్రకటించగా.. మరో జాబితాలో  అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు  జై భారత్ నేషనల్ పార్టీ సైతం  అన్ని  నియోజకవర్గాలలో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు..మాజీ జేడీ, వీవీ లక్ష్మీనారాయణ అన్నారు.  తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన ఆయన.. మొదటి విడతలో 6 లోక్‌సభ, 48 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను  ప్రకటించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మూడు లోక్‌సభ స్థానాలకు కూడా అభ్యర్థులను అనౌన్స్ చేశారు.

తాను కూడా  అసెంబ్లీకి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు లక్ష్మీ నారాయణ .  2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన లక్ష్మీ నారాయణ రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు చెప్పారు.  విశాఖపట్టణం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  తాను బరిలో దిగబోతున్నట్లు  లక్ష్మీనారాయణ ప్రకటించారు.

అలాగే విశాఖ వెస్ట్ నియోజకవర్గం నుంచి వెంకట గణేశ్, భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి ఎలిపిల్లి అనిల్ కుమార్ పోటీ చేయబోతున్నట్లు వీవీ లక్ష్మీనారాయణ చెప్పారు. అలాగే  అరకు, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు, హిందూపురం లోక్‌సభ స్థానాల నుంచి కూడా జైభారత్ నేషనల్ పార్టీ పోటీ చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

మరోవైపు  తెలంగాణలో కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని జై భారత్ నేషనల్ ఆ పార్టీ అధ్యక్షుడు  లక్ష్మీనారాయణ తెలిపారు. అక్కడ పోటీ చేయడానికి 3 లోక్‌సభ స్థానాలకు  అభ్యర్థులను కూడా ప్రకటించారు. మెదక్, మల్కాజ్ గిరి, నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానాలలో పోటీ చేయబోయే తమ అభ్యర్థులను ప్రకటించారు. ఉగాదిలోపు అన్ని నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామని  లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.ఇక సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీకి సీఈసీ టార్చిలైట్ గుర్తును కేటాయించిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =