తుని శాసనసభ నియోజకవర్గం కాకినాడ జిల్లాలో చాలా కీలకమైనది. కాకినాడ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇది ఒకటి. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా గెలుపొందారు. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,12,900 మంది ఓటర్లు ఉన్నారు. పునర్విభజన ఉత్తర్వులు-1951 ప్రకారం ఈ నియోజకవర్గం 1951లో స్థాపించారు. ఇక ఈ ఏడాది గెలుపెవరిదన్నదానిపై నియోజకవర్గ రచ్చబండలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తమ్ముడిని పక్కన పెట్టిన కృష్ణుడు:
టీడీపీ నుంచి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య ఫైట్‌లోకి దిగుతున్నారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న దాడిశెట్టి రాజా జగన్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. తునిపై పట్టు సాధించేందుకు యనమల రామకృష్ణుడు చాలా ప్రయత్నించారు. అయితే పరిస్థితులు ఆయనకు ప్రతికూలంగానే ఉన్నాయంటున్నారు వైసీపీ మద్దతుదారులు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఓడిపోయిన యనమల రామకృష్ణుడు తన తమ్ముడు కృష్ణుడును రాజకీయంగా పక్కన పెట్టారన్న ప్రచారముంది. దీంతో రామకృష్ణుడు తన కుమార్తె దివ్యను రాజకీయాల్లోకి తీసుకువచ్చి వ్యూహాత్మకంగా కృష్ణుడుకు దూరమయ్యారు.
ఏకపక్షమా? రణరంగమా?
ఒకవేళ దివ్య ఓడిపోయినా ఆమె భవిష్యత్తు అభ్యర్థిత్వానికి మార్గం సుగమం చేసేందుకే కృష్ణుడును దూరంగా ఉంచారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పైగా యనమల కుటుంబానికి విధేయుడు, కృష్ణుడు అనుచరుడు శేషగిరి కూడా వీరికి దూరమవ్వడం రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు. శేషగిరి సహా పలువురు కాపు కులస్తులు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. దీనికితోడు తునిలో కృష్ణుడు అనుచరులు 500 కుటుంబాలు వైసీపీలో చేరడం యనమల కుటుంబానికి మద్దతును మరింత బలహీనపరిచిందన్న టాక్ నడుస్తోంది. ఫలితంగా తునిలో రాజకీయ పోరు ఏకపక్షంగా సాగుతుందానన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. అయితే ఏది చివరకు వరకు చెప్పలేం.. ఎందుకుంటే ఓటర్ నాడి ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు కదా.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ