కోడెల శివప్రసాద్ మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Andhra Pradesh Breaking News, AP EX Assembly Speaker Kodela Sivaprasad, AP EX Assembly Speaker Kodela Sivaprasad Passed Away, EX Assembly Speaker Kodela Sivaprasad Passed Away, Kodela Sivaprasad Passed Away, Kodela Sivaprasad Rao Former AP Assembly Speaker Passes Away, Kodela Sivaprasad Rao Passed Away, Mango News Telugu, Political Leaders Condolences To Kodela, Political Leaders Condolences To Kodela Sivaprasad

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కోడెల శివప్రసాద్ మృతిపై ప్రముఖ రాజకీయనాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

కోడెల మృతి బాధాకరం: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ శ్రీ కోడెల శివప్రసాదరావు మృతి విచారకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను.

విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్                                                                                                                    ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు మృతిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి  తెలియజేసారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్                                                                                                                            ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.

కోడెల మృతి తీరని లోటు – టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
కోడెల శివప్రసాద్ గారి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. వైద్యవృత్తి నుంచి తెదేపాలో చేరి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు. ఆయన మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

కోడెల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు: కె. లక్ష్మణ్                                                                                                  ఆంధ్రప్రదేశ్ కోడెల శివప్రసాద్ గారి మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఉన్నత చదువులు చదివి, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి కోడెలని, ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు అని చెప్పారు

తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు-రేవంత్ రెడ్డి                                                                                                                సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న కోడెల మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా సేవలో పరిణతి చెందిన నాయకుడు రాజకీయ కక్షసాధింపులకు బలి కావడం దారుణం. సమాజంలో ఇలాంటి పెడధోరణి క్షేమం కాదు. కోడెల శివప్రసాద్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

కోడెల శివప్రసాద్ గారి మరణవార్తను నమ్మలేకపోతున్నా. బలవన్మరణానికి పాల్పడతారని ఊహించలేదు. ఈ వార్త నన్ను కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబసభ్యులకు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి.. ఓం శాంతి – బీజేపీ ఎంపీ సుజనా చౌదరి

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం పట్ల టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ నాయకురాలు డీకే అరుణ, తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాస రావు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, కళా వెంకట్రావు, కంభంపాటి రామ్మోహనరావు, కొత్తపల్లి గీత తదితరులు ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.

 

[subscribe]
[youtube_video videoid=PMW2plUTV94]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here