జ‌గ‌న్ దాడి.. సంచ‌ల‌నాత్మ‌క క‌థ‌నం!

Jagan's Attack.. Moving Story!, Moving Story, Jagan Campaign, Jagan Campaign Stone Attack, Stone Attack, Stone Attack Jagan, Jagan's Attack, AP State Elections, Bus Trip, Andhra Pradesh, Andhra Pradesh Elections, AP, AP Elections, AP Live Updates, AP Political News, AP Politics, Mango News, Mango News Telugu
Jagan's attack, AP State elections, bus trip

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ‌స్సుయాత్ర 16వ రోజు కొసాగుతోంది. ఏలూరు జిల్లాలో జ‌గ‌న్ యాత్ర‌కు మంచి స్పంద‌నే వ‌స్తోంది. నారాయణపురం నుంచి యాత్ర మొద‌లైంది. ఇప్పుడు జ‌గ‌న్ యాత్ర కంటే.. ఆయ‌న‌పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌పైనే సంచ‌ల‌నాత్మ‌క క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఈకేసులో పోలీసులు కాస్త పురోగ‌తి సాధించారు. అజిత్‌సింగ్ న‌గ‌ర్ వ‌డ్డెర‌కాల‌నీకి చెందిన ప‌ది మంది యువ‌కుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో న‌లుగురిపై అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. దాడికి గ‌ల కార‌ణాల‌ను తెలుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఒక యువ‌కుడిని వెల్లం ప‌ల్లి శ్రీ‌నివాస్ కు చూపించారు. కేసు ద‌ర్యాప్తులో భాగంగా ఘ‌టనాస్థ‌లంలో నాలుగు రాళ్ల‌ను కూడా పోలీసులు సేక‌రించారు. కాగా, విచార‌ణ‌లో వారిలో ఒక మైన‌ర్ దాడికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు దాదాపు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. దాడికి గ‌ల కార‌ణాల‌పై భిన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

జ‌గ‌న్ రాయి కేసు ద‌ర్యాప్తులో ఎనిమిది బృందాలు ప‌ని చేస్తున్నాయి. సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో ఒక యువకుడు సంచలన విషయాలను వెల్లడించినట్టు ఓ వ‌ర్గం మీడియా క‌థ‌నాలు వెలువ‌రుస్తోంది. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకుడు రాయి విసిరినట్లుగా పోలీసులు గుర్తించారు. దాడి చేయటం వెనుక ఉన్న కారణాలు ఏంటో పోలీసులు ఇప్పటికే తెలుసుకున్నారని సమాచారం. జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్న సమయంలో పబ్లిక్‌లో ఉన్న వ్యక్తులు తీసిన వీడియోలను పరిశీలించడం ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. వడ్డెర కాలనీకి చెందిన ఓ యువకుడే అందుకు కారణమని పోలీసులు గుర్తించారు. విచార‌ణ‌లో ఆ యువ‌కుడు దాడికి గ‌ల కార‌ణాల‌ను కూడా చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. అది వైసీపీకి షాకింగ్ ఇచ్చేదిగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

జగన్ యాత్రలో పాల్గొన్న ఆ యువ‌కులకు వైసీపీ నేతలు క్వార్టర్ బాటిల్, 350 రూపాయలు ఇస్తామని చెప్పి స‌భ‌కు తీసుకువ‌చ్చార‌ట‌. అయితే స‌భ‌లో అయిన త‌ర్వాత‌.. కేవ‌లం మద్యం బాటిల్ మాత్ర‌మే ఇచ్చి వెళ్లిపోయారట. డబ్బులివ్వకుండా వెళ్లిపోవడంతోనే జగన్‌ను రాయితో కొట్టినట్టుగా పోలీసుల విచార‌ణ‌లో ఓ యువ‌కుడు చెప్పిన‌ట్లు సమచారం. అయితే దీనిని పోలీసులు అధికారికంగా నిర్ధారించలేదు. కేసు వివ‌రాల‌ను ఎక్క‌డా వెల్ల‌డించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ.. ర‌క‌ర‌కాల క‌థ‌నాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీన్ని వైసీపీ నేత‌లు కొట్టి పారేస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియాలో ఇటువంటి దుష్ప్ర‌చారాలు చేస్తున్నార‌ని ఖండిస్తున్నారు. నిజానిజాలు ద‌ర్యాప్తు అధికారులు వెల్ల‌డిస్తార‌ని అంటున్నారు. దాడిని న‌ట‌న‌గా పేర్కొంటున్న టీడీపీ నేత‌లు, ఆ పార్టీ అనుకూల మీడియా.. దాడికి గ‌ల కార‌ణాల‌ను వ‌క్రీక‌రించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని వైసీపీ ఆరోపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY