కోటంరెడ్డికి షాకిస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి

Adala Prabhakar Reddy Shocking Kotam Reddy, Shocking Kotam Reddy, TDP, Adala Prabhakar Reddy, Kotam Reddy, Congress, YCP, Jana Sena, AP Politics, BJP, Chandrababu, Pawan Kalyan, YS Jagan, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
TDP,Adala Prabhakar Reddy , Kotam Reddy,Congress, YCP, Jana Sena, AP Politics, BJP, Chandrababu, Pawan Kalyan, YS Jagan

రాజకీయాల్లో వివాద రహితులు, రాజకీయ చతురత కలిగిన నేతగా గుర్తింపు ఉన్న నెల్లూరు వైసీపీ రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యూహాలకు టీడీపీ  ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైలెంట్ అయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వారం రోజుల క్రితం వరకు వైసీపీ నుంచి చేరికలే టార్గెట్ గా పావులు కదిపిన  ఆయన.. ఆదాల  దీనికి చెక్ పెట్టడంతో వారం రోజులుగా అన్ని రాజకీయ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు.

మరోవైపు వైసీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ రెడ్డి.. తన ఇమేజ్ పెరగడం కోసం కార్యక్రమాలు చేశారు తప్ప..నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేదని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పుడు టీడీపీ నుంచి బరిలో దిగిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి గెలిస్తే మాత్రం ఒరిగేదేమీ ఉండదని.. రూరల్ నియోజకవర్గంలో రౌడీలు రాజ్యమేలడమే తప్ప అని అక్కడ జనాలు ఫీలవుతున్నారట.

మొన్నటి వరకూ వైసీపీలో ఉన్న వారిని టీడీపీ ఆకర్ష్ అంటూ  తెలుగుదేశం పార్టీ కండువా కప్పే పనిలో ఉన్న కోటంరెడ్డికి ..వారం రోజుల నుంచీ ఆదాల వరుస షాకులిస్తున్నారు. ఇటీవల టీడీపీలో చేరిన  నేతలంతా మళ్లీ మళ్లీ వైసీపీ గూటికే చేరుకోవడంతో  కోటం రెడ్డి షాక్ అవుతున్నారట.  చివరకు  టీడీపీలో ఎప్పటి నుంచో ఉంటున్న మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా కోటంరెడ్డి ధోరణికి  ఆదాల వైపు మొగ్గు చూపిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కోటంరెడ్డి..నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకపోవడం ఇప్పుడు అతనికి వ్యక్తిగతంగా డ్యామేజ్ అయిందన్న వాదన వినిపిస్తుంది. అక్కడ కోటంరెడ్డికి తప్ప ఎవరిని నిలబెట్టినా వారికి ఓటేస్తామన్న కసిలో అక్కడి ఓటర్లు ఉన్నారట. దీనికి తోడు కోటంరెడ్డికి చెక్ పెట్టడానికి వైసీపీ అధిష్టానం ఇప్పటివరకూ ఓటమి తెలియన ఆదాల ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దించడం కోటంరెడ్డికి పెద్ద మైనస్ అవబోతుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 6 =