వైసీపీ శ్రేణులను వణికిస్తున్న వైఎస్ షర్మిల ప్రశ్నలు

YS Sharmila's Questions Shaking The YCP, YS Sharmila, Sharmila's speeches, YCP, TDP, Chandrababu, Jagan, BJP, Pawan kalyan, Questions Shaking The YCP, YS Sharmila Questions, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
YS Sharmila, Sharmila's speeches, YCP, TDP, Chandrababu, Jagan,BJP,Pawan kalyan

వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి సీఎం  జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థులకు మించి సొంత అన్నపై విమర్శలు చేస్తూ.. రాజకీయ యుద్ధం చేస్తున్నారు. దీంతో షర్మిల నోటికి తాళం వేయడానికి వైసీపీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నా కూడా  షర్మిల వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు.

పని కట్టుకుని తన సభలకు వచ్చి అంతరాయం కలిగించాలనుకున్న వైసీపీ శ్రేణులకు షర్మిల దీటుగా సమాధానం చెబుతున్నారు. రోజురోజుకు విమర్శల డోసు పెంచుతూ..  వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని, ప్రభుత్వ వైఫల్యాలను, వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికల ముందు వైసీపీని కోలుకోలేని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుండటంతో వైసీపీ వర్గాలు వణికిపోతున్నాయి.

కడప జిల్లాలో ప్రారంభమైన షర్మిల బస్సు యాత్ర .. ప్రస్తుతం రాయలసీమలో వైఎస్ షర్మిల బస్సు యాత్ర కొనసాగుతోంది.  అయితే ఈ బస్సు యాత్రలో వైఎస్  వివేకానంద రెడ్డి హత్య చుట్టూ షర్మిల ఆరోపణలు ఎక్కువగా సాగడంతో..దీనికి చెక్ పెట్టడానికి ఏకంగా  వైసీపీ కోర్టుకు వరకూ వెళ్లాల్సి వచ్చింది.

దీంతో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయాన్ని పక్కన పెట్టిన షర్మిల.. కొత్త వ్యూహాన్ని  ఎంచుకున్నారు. కోర్టు ఆదేశాలతో వివేకా హత్య అంశాన్ని పక్కన పెట్టి.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తనదైన స్టైల్‌లో ఎండగడుతున్నారు. దీంతో ఎన్నికల ముందు వైసీపీకి భారీ డ్యామేజ్ జరుగుతుందన్న వర్రీ పట్టుకుందట వైసీపీ శ్రేణులకు.

తాజాగా ఆదోనిలో పర్యటిస్తున్న షర్మిలను అడ్డుకోవడానికి కొంతమంది వైసీపీ జెండాలు పట్టుకుని మరీ షర్మిల ప్రసంగానికి అడ్డు వచ్చారు. షర్మిల ప్రసంగిస్తుండగా..సిద్ధం సిద్ధం అంటూ నినాదాలు చేశారు. దీంతో షర్మిల స్ట్రాంగ్ గా రియాక్ట్ అవడంతో వైసీపీ వర్గాలు షాక్ అయ్యాయి. వారి నినాదాలకు బదులిచ్చిన షర్మిల.. దేనికి సిద్ధం? మళ్లీ బీజేపీకి గులాం గిరి చేయడానికా? లేక రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు.

మళ్లీ 11 లక్షల కోట్లు అప్పులు చేయించడానికి సిద్ధమా? రైతులను దారుణంగా వంచించడానికి సిద్ధమా? మద్య నిషేధం మాట తప్పినందుకు సిద్ధమా? దేనికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి అన్నా? అంటూ షర్మిల ప్రశ్నించడంతో వాళ్లు మెల్లగా ఆ ప్రదేశం నుంచి జారుకున్నారు.వైసీపీని గద్దె దించడానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించడంతో షర్మిల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY