చలమలశెట్టి సునీల్.. దిగ్గజ వ్యాపారవేత్త.. గ్రీన్ కో కంపెనీ అధినేత. వ్యాపారరంగంలో అందనంత ఎత్తులో ఉన్నారు చలమలశెట్టి సునీల్. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాల్లో రాణిస్తున్నారు. ఈక్రమంలో రాజకీయాల్లో కూడా రాణించాలని పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు కాదు.. 2009లోనే రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. అప్పటి కోసం గెలుపు కోసం పరితపిస్తూనే ఉన్నారు. కానీ గెలుపు ఆయన గుమ్మం ముందుకు వరకు వచ్చి వెళ్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చి టికెట్ తెచ్చుకున్న వాళ్లే లక్షల మెజార్టీతో గెలుస్తున్నారు. కానీ చలమలశెట్టి సునీల్‌ను మాత్రం అదృష్టం వరించడం లేదు.
2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి చలమలశెట్టి సునీల్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాకినాడ నుంచి ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. 2014లో మరోసారి వైసీపీ తరుపున కాకినాడ నుంచి పోటీ చేశారు. ఈసారి కూడా ఓటమే ఆయన్ను పలకరించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ కూడా ఓటమిపాలయింది. ఆ తర్వాత కొద్దిరోజులుకు సునీల్ తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ముచ్చటగా మూడోసారి కాకినాడ నుంచి టీడీపీ తరుపున పోటీ చేశారు. కానీ ఈసారి కూడా గెలుపు ఆయన తలుపు తట్టలేదు. మూడోసారి చలమలశెట్టి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలుపొంది.. ఏపీలో అధికారంలోకి వచ్చింది.
ఆ తర్వాత కొద్దిరోజులకు మళ్లీ సునీల్ వైసీపీలో చేరారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో నాలుగోసారి సునీల్ వైసీపీ తరుపున కాకినాడ నుంచి పోటీ చేశారు. ఎన్ని పార్టీలు మారినా.. కండువాలు మార్చినా ఆయన అదృష్టం మారడం లేదు.. గెలుపు ఆయన తలుపు తట్టడం లేదు. నాలుగోసారి కూడా జనసేన పార్టీ అభ్యర్థి,టీ టైమ్ గ్రూప్ అధినేత ఉదయ్ శ్రీనివాస్ చేతిలో చలమలశెట్టి సునీల్ ఓడిపోయారు. ఎంపీ పదవిపై ఆశపై.. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని అనిపించుకోవాలనే కోరికతో పట్టువదలని విక్రమార్కుడిగా చలమలశెట్టి సునీల్ చమటోడ్చినప్పటికీ.. గెలుపు దారి ఆయనకు కనిపించడం లేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY