ఏపీలో మే 9న ప్రతిష్టాత్మకంగా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ప్రారంభం – స్పందనపై సమీక్షలో ప్రకటించిన సీఎం జగన్

AP CM Jagan Announces Jaganannaku Chebudam Program will be Started on May 9 During Review Meet on Spandana,AP CM Jagan Announces Jaganannaku Chebudam Program,Jaganannaku Chebudam Program will be Started on May 9,Review Meet on Spandana,Jaganannaku Chebudam on May 9 During Review Meet on Spandana,Mango News,Mango News Telugu,Jaganannaku Chebudam Redressal Programme,Andhra Pradesh CM YS Jagan Mohan Reddy,Jaganannaku Chebudam soon,Jaganannaku Chebudam Program Latest News,Jaganannaku Chebudam Program Latest Updates,Jaganannaku Chebudam Program Live News,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మే 9వ తేదీన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు శుక్రవారం ‘స్పందన’పై సమీక్షలో భాగంగా ఆయన కీలక ప్రకటన చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మే 9వ తేదీన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని, దీని కోసం 1902 హెల్ప్‌లైన్‌ నంబర్‌ను వినియోగంలోకి తీసుకు రావాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించాలని, దీనిపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశామని పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమం అమలు చేయడంపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

స్పందనపై సమీక్షలో సీఎం జగన్ చేసిన పలు కీలక సూచనలు..

  • ఇప్పటికే స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం, స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం.
  • నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం లక్ష్యం.
  • అలాగే ఇండివిడ్యువల్‌ గ్రీవెన్సెస్‌ను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
  • 1902 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేసి గ్రీవెన్స్‌ రిజిస్టర్‌ చేస్తే, దానిని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలి.
  • దీని అమలుకు సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్‌ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయి.
  • తమ పరిధిలోని ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్‌ చేస్తుండాలి.
  • గ్రీవెన్స్‌ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలి.
  • ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యపడుతుంది.
  • ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది ముఖ్యమైన విషయం.
  • వ్యక్తిగత ఫిర్యాదులు, కుటుంబం స్థాయిలో వచ్చే ఫిర్యాదులను నమోదు చేసిన తర్వాత వాటిని నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలి.
  • ప్రభుత్వ సేవలు, పథకాలపై ఎంక్వైరీ సహా ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం అన్నది దీని ముఖ్య ఉద్దేశం.
  • ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్‌ అయి ఉండటంతో వారి ఫిర్యాదులను నేరుగా తెలియచేయజేసే అవకాశం ఉంటుంది.
  • ముఖ్యమంత్రి కార్యాలయం ఫిర్యాదులను నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చూస్తుంది.
  • ఐవీఆర్ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు రెగ్యులర్‌ అప్‌డేట్స్ అందుతాయి.
  • ఇక హెల్ప్‌లైన్‌ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులనుంచి ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకుంటుంది.
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్‌ గురించి అవగాహన కల్పిస్తారు.
  • జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమల్లో మూడు కీలక యంత్రాంగాల ఉంటాయి.
  • సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకూ ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయి.
  • ప్రతి జిల్లాకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ప్రత్యేకాధికారులుగా ఉంటారు.
  • ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను క్రమం తప్పకుండా వీరు సందర్శించి పర్యవేక్షిస్తారు.
  • వీరు సమస్యల పరిష్కారాల తీరును రాండమ్‌గా చెక్‌చేస్తారు, అలాగే ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల పనితీరును పర్యవేక్షిస్తారు.
  • ఎక్కడైనా సమస్య పరిష్కారం పట్ల సంతృప్తి లేకపోతే, ఎస్‌ఎంఎస్‌, ఐవీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారు.
  • చీఫ్‌ సెక్రటరీ, సీఎంఓ, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్‌ చేస్తారని, ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సమీక్ష ఉంటుంది.
  • జగనన్నకు చెబుదాం అమలుకు ప్రతి కలెక్టర్‌కు రూ.3 కోట్ల రూపాయలను తక్షణ నిధులుగా ప్రభుత్వం ఇస్తుంది.
  • అవసరమైన చోట.. ఈ డబ్బును ఖర్చు చేయవచ్చు, వీటిని ఖర్చు చేసే అధికారం కలెక్టర్‌కు ఇస్తున్నాం.
  • ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పేరు పెట్టారంటే మొత్తం ప్రభుత్వం యంత్రాంగం పేరు పెట్టినట్టే భావించాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − two =