ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టు ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయల్దేరిన పవన్ రోడ్డు మార్గంలో జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు వెళ్లారు. పవన కళ్యాణ్‌కు ఆలయ సిబ్బంది, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆంజనేయస్వామివారిని పవన్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న పవన్ కాషాయ వస్త్రాలతోనే అంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
పవన్ కొండట్టుకు వెళ్తున్నారని తెలిసి అభిమానులు దారి పొడవునా ఆయనకు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి పవన్ కొండగట్టుకు వెళ్తుండగా.. తుర్కపల్లి వద్ద పవన్‌ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అలాగే సిద్ధిపేట జిల్లా ఒంటిమామిడి వద్ద పవన్ అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. అలాగే వీరఖడ్గాన్ని పవన్‌కు అందించారు. అనంతరం అభిమానులకు అభివాదం చేసి వారిని ఉద్దేశించి కాసేపు ప్రసంగించారు. అక్కడి నుంచి నేరుగా కొండగట్టుకు చేరుకున్నారు.
ఇకపోతే పవన్‌కు కొండగట్టు ఆంజనేయస్వామి సెంటిమెంట్ దేవుడు. కొండగట్టు అంజన్నస్వామి వారాలిచ్చే దేవుడని.. కోరిన కోరికలను తప్పకుండా నెరవేరుస్తారని పవన్ గట్టిగా విశ్వసిస్తాడు. అలాగే అందరికీ శక్తినిచ్చేదేవుడ ఆంజనేయస్వామిని అని పవన్ భావిస్తారు. అందుకే ఏ పని మొదలు పెట్టినా ముందు ఆంజనేయస్వామివారికి పూజలు చేస్తుంటారు. గతంలో వారాహి వాహనానికి కూడా ముందు కొండగట్టులోనే పూజలు చేయించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ