నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ,జనసేన నేతలు

Election Of MLC In AP Is Unanimous,Election Of MLC,Unanimous,AP,MLC post,TDP,Vangaveeti Radha,AP CM who Chandrababu, C. Ramachandraiah, MLA Kota MLC candidates finalized, Pidugu Hari Prasad, TDP and Jana Sena leaders filed nominations ,bjp,Chandrababu,Jagan,Janasena, pawan kalyan,TDP,YCP,Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, AP Politics, Political News, Mango News, Mango News Telugu
Election of MLC in AP is unanimous,TDP and Jana Sena leaders filed nominations,MLA Kota MLC candidates finalized,C. Ramachandraiah, Pidugu Hari Prasad

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్ధులుగా టీడీపీ, జనసేన నేతలు నామినేషన్‌ దాఖలు చేశారు. కడప జిల్లాకు చెందిన  సీనియర్  నాయకుడు సి. రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేయగా, పి.హరిప్రసాద్‌ జనసేన నుంచి నామినేషన్ వేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి. రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరారు.

ఆ సమయంలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేయగా.. సీనియర్ నేత సి.రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది. దీంతో ఖాళీ అయిన ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జులై 12వ తేదీన ఉపఎన్నిక జరగనుంది. అప్పుడు అనర్హత వేటు పడిన సి. రామచంద్రయ్యకు టీడీపీ మరోసారి అవకాశాన్ని కల్పించింది. అటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి.హరిప్రసాద్ అభ్యర్థిత్వాన్ని కూడా అధిష్టానం ఖరారు చేయడంతో… వాళ్లిద్దరూ జులై 2న నామినేషన్లు దాఖలు చేశారు.

అయితే ఇతర పార్టీల నుంచి ఎవరూ కూడా ఎమ్మెల్సీ స్థానం కోసం నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో  సి. రామచంద్రయ్య, హరిప్రసాద్‌ ఎన్నిక ఏకగ్రీవం కాబోతోంది.   మరోసారి ఎమ్మెల్సీగా తనకు బాధ్యతలను అప్పగించినందుకు సీఎం చంద్రబాబుకు  సి. రామచంద్రయ్య ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తల సాధకబాధలు తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు అని  కొనియాడారు.

మరోవైపు ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‎కి తాను రుణపడి ఉంటానని పి.హరిప్రసాద్ అన్నారు. జర్నలిస్టుగా చాలా సమస్యల మీద పరోక్షంగా పోరాటం చేశానని గుర్తు చేసుకున్న హరిప్రసాద్.. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తాననని  చెప్పుకొచ్చారు. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం.. జూన్‎లో ఎన్నికల  సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే జులై 2న కడప జిల్లాకు చెందిన  సీనియర్  నాయకుడు సి. రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేయగా, పి.హరిప్రసాద్‌ జనసేన నుంచి నామినేషన్ వేశారు.

జులై 12న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అధికారులు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే ఈసారి అయితే ఇతర పార్టీల నుంచి ఎవరూ కూడా ఎమ్మెల్సీ స్థానం కోసం నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో  సి. రామచంద్రయ్య, హరిప్రసాద్‌ ఎన్నిక ఏకగ్రీవం కాబోతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY