మానవ సంబంధాల నేపథ్యంలో తెరకెక్కిన అద్భుత చిత్రం ‘పదిలం’ (Padilam) ప్రస్తుతం మ్యాంగో తెలుగు సినిమా యూట్యూబ్ ఛానల్‌లో స్ట్రీమ్ అవుతోంది. ప్రజ్ఞిక, చిత్తరంజన్ మరియు శిరీష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, విడుదలకు ముందే విమర్శకుల ప్రశంసలు పొంది 2026లో అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిలింగా నిలిచింది.
టి.ఎన్. సుబ్రహ్మణ్యం మరియు టి. సిద్ధు కథను అందించగా, సిద్ధు దర్శకత్వంలో తేజవత్ సైదులు & తేజవత్ మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. భావోద్వేగాల మేళవింపుతో సాగే ఈ షార్ట్ ఫిల్మ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కొత్తదనాన్ని కోరుకునే వారు తప్పక చూడాల్సిన చిత్రమిది.






































