ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..రాజధాని అమరావతికి మంచి రోజులు వచ్చాయని అంతా భావిస్తున్నారు. దీనికి తగినట్లే తమ ప్రభుత్వం రాజధాని అమరావతిని డెవలప్ చేయడం పైన ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు.. ఇటీవల అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.శ్వేత పత్రం విడుదల చేసిన సమయంలో..వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో భారీ విధ్వంసాన్ని చేసిందని వివరిస్తూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
నిజానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అమరావతి పూర్తి నిర్లక్ష్యానికి గురి కావడంతో అక్కడ భారీ నష్టమే సంభవించింది. దీంతో ఆ నష్ట నివారణ కోసం ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చర్యలను మొదలు పెట్టింది. అయితే ఈ నష్ట నివారణ చర్యలకు భారీగానే ఖర్చు చేయాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీకి రాజధాని అయిన అమరావతిలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పిచ్చి చెట్లు, కంపలు పెరిగిపోయి కనీసం వేసిన సీసీ రోడ్లు కూడా కనిపించని పరిస్థితి ఉంది.
దీంతో రాజధాని అమరావతిని శుభ్రం చేయడానికి నిర్ణయించిన కూటమి ప్రభుత్వం.. అమరావతి ప్రాంతంలో భారీగా పెరిగిన పిచ్చి చెట్లు, కంపలను తొలగించడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయవలసి వస్తుంది. దీని కోసం రూ. 36.50 కోట్లతో టెండర్లను ఆహ్వానిస్తుంది. రాజధాని అమరావతిలోని 29 గ్రామాలలో 25వేల ఎకరాలలో జంగిల్ క్లియరింగ్ కోసం ఏపీ సీఆర్డీఏ టెండర్లను ప్రకటించింది.
వారం రోజుల్లోగా ఈ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని.. నెల రోజుల్లో రాజధాని అమరావతిని శుభ్రం చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది.దీంత సీఆర్డీఏ అధికారులు జంగిల్ క్లియరెన్స్ కోసం రూ. 36.50 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించారు. ఈ రోజు మధ్యాహ్నం 1.30 నిమిషాల నుంచి ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ నుంచి.. బిడ్ డాక్యుమెంట్ను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించి ప్రాసెస్ కూడా మొదలు పెడుతున్నారు .
టెండర్ల ప్రక్రియలో భాగంగా ముందుగా ఈ నెల 15న కాంట్రాక్టర్లతో ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహిస్తారు. అలాగే జులై 22 న క్లారిఫికేషన్ కోసం కాంట్రాక్టర్లతో సమావేశమయ్యి.. అదే రోజు నుంచి బిడ్2లను సమర్పించే అవకాశాన్ని కల్పిస్తారు. జులై 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ టెండర్లు సమర్పించడానికి గడువు ముగుస్తుంది. కాంట్రాక్టు కంపెనీలు కన్సార్టియంగా కానీ జాయింట్ వెంచర్ గా కానీ ఏర్పడి .. ఈ టెండర్లలో పాల్గొనడానికి అవకాశాన్ని కల్పించారు. నెల రోజుల్లోనే రాజధాని గత వైభవాన్ని సంతరించుకుంటుందని అక్కడి వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE