ఏపీలో అవకతవకలకు పాల్పడిన 17 మంది గ్రామ వాలంటీర్లు సస్పెండ్

17 Village Volunteers Suspended, 17 Village Volunteers Suspended in West Godavari, AP YSR Cheyutha Scheme, Village Volunteers Suspended in West Godavari District, West Godavari District, YSR Cheyutha Scheme, YSR Cheyutha Scheme In West Godavari District, YSR Cheyutha Scheme News, YSR Cheyutha Scheme Updates

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న 17 మంది గ్రామ వాలంటీర్లను అధికారులు సస్పెండ్‌ చేశారు. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలో వీరిపై వేటు పడింది. జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు ఆదేశాల మేరకు 17 మంది వాలంటీర్ల సస్పెన్షన్ పై ఎంపీడీవో ఎస్‌వీఎస్‌ ప్రసాద్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ అంగన్ వాడీ ఉద్యోగులు, ఇతర దేశాల్లో ఉంటున్న కొందరిని వైఎస్ఆర్‌ చేయూత పథకంలో లబ్దిదారులుగా చేర్చడంతోనే వీరిని సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ అంశంలో నిబంధనలు ఉల్లంఘించడంపై సంబంధిత గ్రామ సచివాలయాల్లోని 9 మంది వెల్ఫేర్‌ అసిస్టెంట్లకూ కూడా మెమోలు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu