మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7, బుధవారం నాడు ఒక్కరోజే 14,578 కరోనా పాజిటివ్ కేసులు, 355 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,80,489 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 39,072 కు పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పటికి 73,24,188 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (అక్టోబర్ 7, బుధవారం నాటికీ):
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 14,80,489
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 11,96,441
- యాక్టీవ్ కేసులు – 2,44,527
- అక్టోబర్ 7 న నమోదైన కేసులు – 14,578
- అక్టోబర్ 7 న డిశ్చార్జ్ అయినవారు – 16,715
- అక్టోబర్ 7 న నమోదైన మరణాల సంఖ్య – 355
- మొత్తం మరణాల సంఖ్య – 39,072
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu