నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలో అపశృతి చోటుచేసుకుంది. భారీగా కార్యర్తలు, ప్రజలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు సహా ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు. అలాగే మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ‘ఇదేం కర్మ మనరాష్ట్రానికి’ నిరసనలో భాగంగా చంద్రబాబు నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి జరిగిన రోడ్ షోలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తుండగా ఒకవైపున కొంత గందరగోళం చెలరేగింది. దీంతో చంద్రబాబు ఏమైందని మైక్ లో ప్రశ్నించగా.. తొక్కిసలాట జరిగిందని కింద ఉన్న నేతలు ఆయనకు చెప్పారు. దీంతో అప్రమత్తమైన ఆయన వెంటనే పోలీసులను పరిస్థితి చక్కదిద్దాల్సిందిగా కోరారు. అయితే అప్పటికే కొందరు వ్యక్తులు గుండంకట్ట ఔట్‌లెట్‌లో ఒక్కసారిగా జారిపడిపోయారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, కార్యకర్తలు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు బాధితుల యోగక్షేమాలు తెలుసుకున్నాకే ప్రసంగం చేస్తానంటూ కార్యక్రమాన్ని నిలిపేసి ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాధితుల పరిస్థితిపై వాకబు చేశారు. వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా చంద్రబాబు వైద్యులను కోరారు. గాయపడినవారితో మాట్లాడిన చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు.
ఇక ఈ ఘటనలో మృతి చెందిన వారిని.. దేవినేని రవీంద్రబాబు (ఆత్మకూరు), కలవకూరి యానాది (కొండముడుసుపాలెం), యాటగిరి విజయ (ఉలవపాడు), కాకుమాని రాజా (కందుకూరు), మరలపాటి చినకొండయ్య (గుళ్లపాలెం), పురుషోత్తం (కందుకూరు)లుగా గుర్తించారు. కాగా ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని, ఇకముందు ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూసుకోవాలని కార్యకర్తలతో పాటు ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరపున రూ. 10లక్షల పరిహారం ప్రకటించారు. అంతేకాకుండా వారి కుటుంబాలకు అండగా ఉంటామని, వారి పిల్లలను టీడీపీ ట్రస్ట్ తరపున చదువులు చెప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన, వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE