ఏడాది తర్వాత జైలు నుంచి విడుదలైన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్

Former Maharashtra Home Minister Anil Deshmukh Released From Arthur Road Jail After 1 Year,Former Maharashtra Home Minister,Anil Deshmukh Released,Arthur Road Jail,Mago news,Mango News Telugu,List Of Ex Home Minister Of Maharashtra,Current Maharashtra Home Minister,Maharashtra Home Minister Name 2022,New Home Minister Of Maharashtra,Home Minister Of Maharashtra Contact Number,Home Minister Of Maharashtra Address,Anil Deshmukh And Vilasrao Deshmukh Relationship,Anil Deshmukh Daughter Pooja,Maharashtra Home Minister Email Id,Former Maharashtra Home Minister Anil Deshmukh

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత అనిల్ దేశ్‌ముఖ్ బుధవారం ఆర్థర్ రోడ్ జైలు నుంచి ఏడాది తర్వాత విడుదలయ్యారు. ముంబై హైకోర్టు దేశ్‌ముఖ్‌కు బెయిల్ మంజూరు చేసే ఉత్తర్వుపై స్టేను పొడిగించేందుకు నిరాకరించడంతో ఆయన విడుదలయ్యారు. కాగా ఒక అవినీతి కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనిల్ దేశ్‌ముఖ్ ఏడాదిగా ఆర్థర్ రోడ్ జైలులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో దేశ్‌ముఖ్ కు డిసెంబర్ 12న జస్టిస్ ఎంఎస్ కార్నిక్ బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు సీబీఐ 10 రోజులు గడువు అడగటంతో డిసెంబర్ 27 వరకూ హైకోర్టు తమ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఈ సందర్భంగా దేశ్‌ముఖ్.. ‘న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నన్ను తప్పుడు కేసులో ఇరికించారని హైకోర్టు కూడా అభిప్రాయపడింది’ అని అన్నారు. ఇక ఆయనకు అజిత్ పవార్‌తో సహా సీనియర్ ఎన్‌సీపీ నాయకులు జైలు వెలుపల అతనికి స్వాగతం పలికారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =