ఏపీ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 81.67 శాతం పోలింగ్ నమోదు

81.67 Percent Polling Reported in AP Second Phase Panchayat Elections

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 13 జిల్లాల్లోని 2786 పంచాయతీలకు, 20,817 వార్డులకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81.67% పోలింగ్ ‌నమోదయినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, అలాగే ఎక్కడా రీ-పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితులు లేవని ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 86.60 శాతం పోలింగ్ నమోదు కాగా, శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 72.87 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పక్రియ కొనసాగుతుంది. ఫలితాలు వెలువడిన గ్రామాల్లో ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తున్నారు.

జిల్లాలవారీగా పోలింగ్ శాతం వివరాలు:

  • తూర్పుగోదావరి: 82.86
  • పశ్చిమగోదావరి: 81.75
  • కృష్ణా: 84.12
  • గుంటూరు: 85.51
  • ప్రకాశం: 86.60
  • నెల్లూరు: 78.04
  • శ్రీకాకుళం: 72.87
  • విశాఖపట్నం: 84.94
  • చిత్తూరు జిల్లా: 77.20
  • అనంతపురం: 84.65
  • కడప: 80.47
  • కర్నూలు: 80.76
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ